Share News

టీ20 ప్రపంచ కప్: యూఏఈతో మ్యాచ్.. అఫ్గానిస్తాన్ ఘన విజయం

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:59 PM

పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే ఛేదించింది.

టీ20 ప్రపంచ కప్: యూఏఈతో మ్యాచ్.. అఫ్గానిస్తాన్ ఘన విజయం
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్.. 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి ఈ టోర్నీలో తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. సూపర్ 8 ఆశలు ఇంకా సజీవంగానే నిలుపుకుంది.


అఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జర్దాన్(53; 41 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆఖర్లో అజ్మాతుల్లా రెహమాన్(40*; 21 బంతుల్లో2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రసూలీ(33) పర్వాలేదనిపించాడు. ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో జునైద్, అర్ఫాన్ చెరో 2, జవాదుల్లా 1 వికెట్ తీసుకున్నారు.


తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. సోహైబ్ ఖాన్(68; 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అలీషాన్ షరాఫు(40) రాణించాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 4 వికెట్లు తీసి యూఏఈ పతనాన్ని శాసించాడు. ముజీబుర్ రెహమాన్ 2, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.కాగా అటు బ్యాట్‌తో సంచలన ఇన్నింగ్స్‌ ఆడటంతో పాటు.. బంతితో 4 వికెట్లు తీసుకున్న అజ్మాతుల్లాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.


ఇవి కూడా చదవండి:

ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

Updated Date - Feb 16 , 2026 | 03:40 PM