Share News

టీ20 ప్రపంచ కప్.. భారత్-పాక్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABN , First Publish Date - Feb 15 , 2026 | 06:22 PM

టీ20 ప్రపంచ కప్.. భారత్-పాక్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

టీ20 ప్రపంచ కప్.. భారత్-పాక్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
T20 World Cup

Live News & Updates

  • Feb 15, 2026 22:16 IST

    పాకిస్థాన్ ఆలౌట్.. భారత్ ఘన విజయం

    • 176 పరుగుల ఛేదనలో తీవ్రంగా విఫలమైన పాకిస్థాన్

    • 18 ఓవర్లలో 114 పరుగులకు పాక్ ఆలౌట్

    • 61 పరుగుల తేడాతో పాక్‌పై టీమిండియా ఘన విజయం

    • హార్దిక్ పాండ్య, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలకు తలో 2 వికెట్లు

    • కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మలకు చెరొక వికెట్

  • Feb 15, 2026 22:12 IST

    షాహీన్ 2 బౌండరీలు

    • రింకు సింగ్ వేసిన 17వ ఓవర్లో 2 బౌండరీలు బాదిన షాహీన్ అఫ్రిది(17)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 9

    • 17 ఓవర్లకు పాక్ స్కోర్ 106/9

  • Feb 15, 2026 22:06 IST

    వరుణ్‌కు మరో వికెట్

    • వరుణ్ చక్రవర్తి వేసిన 16వ ఓవర్ నాలుగో బంతికి అబ్రార్(0) ఎల్బీడబ్ల్యూ

    • వెనువెంటనే వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్

    • 97 పరుగుల వద్ద తొమ్మిదో డౌన్

  • Feb 15, 2026 22:03 IST

    పాక్ ఎనిమిదో వికెట్ డౌన్

    • వరుణ్ చక్రవర్తి వేసిన 16వ ఓవర్ మూడో బంతికి రింకు సింగ్‌కు క్యాచ్ ఇచ్చిన ఫహీమ్(10)

    • 97 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్

  • Feb 15, 2026 22:02 IST

    తిలక్ వర్మ మిస్ ఫీల్డ్

    • 15వ ఓవర్ వేసిన తిలక్ వర్మ

    • ఐదో బంతికి షాహీన్ ఇచ్చిన క్యాచ్‌ను మిస్ చేసిన తిలక్

    • క్రీజులో ఫహీం(8), షాహీన్(6)

    • 15 ఓవర్లకు పాక్ స్కోర్ 94/7

  • Feb 15, 2026 21:58 IST

    చెమటోడుస్తోన్న పాకిస్థాన్

    • కుల్దీప్ వేసిన14వ ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • క్రీజులో ఫహీం(7), షాహీన్(2)

    • 14 ఓవర్లకు పాక్ స్కోర్ 89/7

    • పాక్ విజయానికి 36 బంతుల్లో 87 పరుగులు అవసరం

  • Feb 15, 2026 21:49 IST

    తిలక్ వర్మకు వికెట్.. షాదాబ్(14) ఔట్

    • తిలక్ వర్మ వేసిన 13వ ఓవర్ తొలి బంతికే శివం దూబేకి క్యాచ్ ఇచ్చిన షాదాబ్

    • 78 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన పాక్

  • Feb 15, 2026 21:45 IST

    నవాజ్(4) ఔట్.. పాక్ ఆరో వికెట్ డౌన్

    • కుల్దీప్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి శివం దూబేకి క్యాచ్ ఇచ్చిన నవాజ్

    • పాక్ ఆరో వికెట్ డౌన్

  • Feb 15, 2026 21:40 IST

    అక్షర్‌కు రెండో వికెట్.. ఉస్మాన్(44) ఔట్

    • అక్షర్ పటేల్ వేసిన 11వ ఓవర్లో నాలుగో బంతికి ఉస్మాన్ ఖాన్(44) స్టంప్ ఔట్

    • 73 పరుగుల వద్ద పాక్ ఐదో వికెట్ డౌన్

  • Feb 15, 2026 21:39 IST

    10 ఓవర్లు పూర్తి.. పాకిస్థాన్ స్కోర్ 71/4

    • కుల్దీప్ వేసిన పదో ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • క్రీజులో ఉస్మాన్ ఖాన్(42), షాదాబ్(13)

    • పాక్ విజయానికి 60 బంతుల్లో 105 పరుగులు అవసరం

  • Feb 15, 2026 21:34 IST

    ఉస్మాన్ దూకుడు

    • అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఉస్మాన్ ఖాన్(40)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 9

    • 9 ఓవర్లకు పాక్ స్కోర్ 66/4

  • Feb 15, 2026 21:31 IST

    పోరాడుతోన్న ఉస్మాన్ ఖాన్

    • ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఒంటరిగా పోరాడుతోన్న ఉస్మాన్ ఖాన్(29)

    • అక్షర్ వేసిన ఏడో ఓవర్లో 2 బౌండరీలు బాదిన ఉస్మాన్

    • మరో ఎండ్‌లో షాదాబ్(2)

    • 7 ఓవర్లకు పాక్ స్కోర్ 47/4

  • Feb 15, 2026 21:16 IST

    పాక్ నాలుగో వికెట్ డౌన్

    • అక్షర్ పటేల్ వేసిన ఐదో ఓవర్ నాలుగో బంతికి బాబర్ ఆజం(5) క్లీన్ బౌల్డ్

    • 34 పరుగుల వద్ద పాక్ నాలుగో వికెట్ డౌన్

  • Feb 15, 2026 21:13 IST

    తడబడుతోన్న పాక్ బ్యాటర్లు

    • బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో వచ్చిన పరుగులు 4

    • క్రీజులో ఉస్మాన్(9), బాబర్(5)

    • 4 ఓవర్లకు పాక్ స్కోర్ 25/3

  • Feb 15, 2026 21:09 IST

    కట్టుదిట్టమైన బౌలింగ్

    • మూడో ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య

    • నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదిన ఉస్మాన్ ఖాన్(7)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 8

    • మరో ఎండ్‌లో బాబర్(4)

    • 3 ఓవర్లకు పాకిస్థాన్ స్కోర్ 21/3

  • Feb 15, 2026 21:04 IST

    బుమ్రాకు రెండు వికెట్లు

    • సైమ్ అయుబ్ (6) అవుట్

    • బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా అవుట్

    • చివరి బంతికి కెప్టెన్ సల్మాన్ అవుట్

    • రెండు ఓవర్లకు పాక్ స్కోరు 13/3

  • Feb 15, 2026 20:55 IST

    తొలి ఓవర్లోనే వికెట్..

    • ఫర్హాన్ డకౌట్

    • హార్దిక్ బౌలింగ్ వికెట్

    • క్యాచ్ పట్టిన రింకూ

    • తొలి ఓవర్‌కు పాక్ 0/1

  • Feb 15, 2026 20:43 IST

    భారత్ ఇన్నింగ్స్ పూర్తి.. పాక్ టార్గెట్ 176

    • ఆఖరిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చిన రింకు సింగ్(11*; 4 బంతుల్లో)

    • నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసిన టీమిండియా

    • ఇషాన్ కిషన్(77) సూపర్ హాఫ్ సెంచరీ

    • సయామ్ ఆయుబ్ 3, షాహీన్ అఫ్రిది, సల్మాన్, తారిక్‌లకు తలొక వికెట్

    • పాక్ విజయ లక్ష్యం 176

  • Feb 15, 2026 20:40 IST

    షాహీన్‌కు వెనువెంటనే వికెట్లు

    • దూబే రనౌట్ తర్వాత ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి సయామ్‌కు క్యాచ్ ఇచ్చిన అక్షర్ పటేల్(0)

    • ఒకే ఓవర్లో షాహీన్‌కు రెండు వికెట్లు

  • Feb 15, 2026 20:38 IST

    ఛా.. దూబే(27) రనౌట్

  • Feb 15, 2026 20:33 IST

    భారత్ ఐదో వికెట్ డౌన్.. సూర్య(32) ఔట్

    • తారిక్ వేసిన 19వ ఓవర్ ఐదో బంతికి సయామ్‌కి క్యాచ్ ఇచ్చిన సూర్య(32)

    • 159 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా

    • క్రీజులోకి రింకు సింగ్

  • Feb 15, 2026 20:30 IST

    150 దాటిన టీమిండియా స్కోర్

    • అబ్రార్ బౌలింగ్‌లో తొలి బంతికే బౌండరీ బాదిన సూర్య(32)

    • ఐదో బంతికి భారీ సిక్సర్ బాదిన దూబే(18)

    • 18 ఓవర్లకు టీమిండియా స్కోర్ 154/4

  • Feb 15, 2026 20:26 IST

    నెమ్మదించిన స్కోర్ బోర్డు

    • నిలకడగా ఆడుతోన్న భారత బ్యాటర్లు

    • తారిక్ వేసిన ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 4

    • క్రీజులో సూర్యకుమార్(26), దూబే(10)

    • 17 ఓవర్లకు టీమిండియా స్కోర్ 140/4

  • Feb 15, 2026 20:22 IST

    దూబే బౌండరీ

    • 16వ ఓవర్ వేసిన నవాజ్

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 9

    • ఐదో బంతికి బౌండరీ బాదిన శివం దూబే(8)

    • 16 ఓవర్లకు టీమిండియా స్కోర్ 136/4

  • Feb 15, 2026 20:19 IST

    15 ఓవర్లు పూర్తి.. టీమిండియా స్కోర్ 127/4

    • సయామ్ వేసిన ఈ ఓవర్లో వచ్చిన పరుగులు కేవలం 2

    • రెండు, మూడో బంతులకు తిలక్(25), హార్దిక్(0) ఔట్

    • క్రీజులో సూర్యకుమార్(22), దూబే(1)

  • Feb 15, 2026 20:13 IST

    మరో వికెట్ డౌన్.. హార్దిక్(0) ఔట్

    • భారీ షాట్‌కు ప్రయత్నించి బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చిన హార్దిక్ పాండ్య

    • సయామ్‌కు వెనువెంటనే రెండు వికెట్లు

    • 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • Feb 15, 2026 20:11 IST

    భారత్ మూడో వికెట్ డౌన్.. తిలక్ ఔట్

    • సయామ్ వేసిన 15వ ఓవర్ రెండో బంతికి తిలక్ వర్మ(25) ఎల్బీడబ్ల్యూ

    • 126 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

  • Feb 15, 2026 20:07 IST

    సూర్య జోరు

    • నవాజ్ వేసిన 14వ ఓవర్ నాలుగో బంతికి బౌండరీ బాదిన సూర్యకుమార్(21)

    • మరో ఎండ్‌లో ఆచితూచి ఆడుతోన్న తిలక్ వర్మ(25)

    • 14 ఓవర్లకు టీమిండియా స్కోర్ 125/2

  • Feb 15, 2026 20:03 IST

    తడబడుతోన్న తారిక్

    • 13వ ఓవర్లో ఓ వైడ్ బాల్ వేసిన ఉస్మాన్ తారిక్

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 10

    • తారిక్‌కు బంతిని సరిగ్గా రీడ్ చేసి బ్యాటింగ్ చేస్తోన్న సూర్య(14)

    • 13 ఓవర్లకు టీమిండియా స్కోర్ 118/2

  • Feb 15, 2026 19:59 IST

    ఇప్పుడు తిలక్ వంతు

    • నవాజ్ వేసిన 12వ ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాదిన తిలక్ వర్మ(21)

    • ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూ

    • నాటౌట్ ఇచ్చిన అంపైర్.. పాక్ రివ్యూ

    • అంపైర్స్ కాల్ ఇవ్వడంతో సూర్యకు లైఫ్(12)

    • 12 ఓవర్లకు టీమిండియా స్కోర్ 108/2

  • Feb 15, 2026 19:52 IST

    తారిక్‌కు బౌండరీతో వెల్‌కమ్

    • పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌కు బౌండరీతో ఆహ్వానం పలికిన సూర్య(8)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 6

    • మరో ఎండ్‌లో తిలక్ వర్మ(13)

    • 11 ఓవర్లకు టీమిండియా స్కోర్ 98/2

  • Feb 15, 2026 19:48 IST

    10 ఓవర్లు పూర్తి.. టీమిండియా స్కోర్ 92/2

    • పదో ఓవర్ వేసిన నవాజ్

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 3

    • క్రీజులో సూర్యకుమార్(3), తిలక్ వర్మ(12)

  • Feb 15, 2026 19:41 IST

    ప్చ్.. ఇషాన్(77) ఔట్

    • బౌండరీ బాది తర్వాతి బంతికే ఇషాన్ కిషన్(77) క్లీన్ బౌల్డ్

    • సయామ్ ఆయుబ్‌కు వికెట్

    • 88 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ డౌన్

  • Feb 15, 2026 19:35 IST

    బాదుడే బాదుడi.. 2,6,4,2,2,1

    • షాదాబ్ బౌలింగ్‌లో ఓ సిక్సర్, బౌండరీ బాదిన ఇషాన్ కిషన్(72)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 17

    • పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తోన్న ఇషాన్ కిషన్

    • 8 ఓవర్లకు టీమిండియా స్కోర్ 82/1

  • Feb 15, 2026 19:30 IST

    ఇషాన్ ఆన్ ఫైర్

    • ఏడో ఓవర్ వేసిన అబ్రార్

    • వరుసగా తొలి మూడు బంతుల్లో బౌండరీలు బాదిన ఇషాన్ కిషన్(55)

    • మరో ఎండ్‌లో తిలక్ వర్మ(10)

    • 7 ఓవర్లకు టీమిండియా స్కోర్ 65/1

  • Feb 15, 2026 19:27 IST

    ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ

    • అబ్రార్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్(50; 27 బంతుల్లో)

  • Feb 15, 2026 19:25 IST

    పవర్ ప్లే పూర్తి.. టీమిండియా స్కోర్ 52/1

    • తగ్గేదే లే అన్నట్లు బీభత్సం సృష్టిస్తోన్న ఇషాన్ కిషన్(42)

    • సయామ్ వేసిన ఆరో ఓవర్లో ఓ బౌండరీ బాదిన ఇషాన్

    • ఆఖరి బంతికి తిలక్ వర్మ(10) బౌండరీ

    • పవర్ ప్లే పూర్తి అయ్యే వరకు స్కోర్ 52/1

  • Feb 15, 2026 19:20 IST

    జోరు పెంచిన ఇషాన్.. స్కోర్ 41/1

    • అబ్రార్‌కు సిక్సర్‌తో ఆహ్వానం పలికిన ఇషాన్(36)

    • మళ్లీ మూడో బంతికి బౌండరీ బాదిన ఇషాన్

    • ఐదో ఓవర్లో వచ్చిన పరుగులు 11

    • 5 ఓవర్లకు టీమిండియా స్కోర్ 41/1

  • Feb 15, 2026 19:15 IST

    కట్టుదిట్టమైన బౌలింగ్

    • సయామ్ వేసిన నాలుగో ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • మూడో బంతికి బౌండరీ బాదిన ఇషాన్(25)

    • 4 ఓవర్లకు టీమిండియా స్కోర్ 30/1

  • Feb 15, 2026 19:12 IST

    ఆచితూచి ఆడుతోన్న టీమిండియా బ్యాటర్లు

    • మూడో ఓవర్ వేసిన సల్మాన్ అఘా

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 9

    • తొలి బంతికే బౌండరీ బాదిన ఇషాన్ కిషన్(20)

    • మరో ఎండ్‌లో తిలక్ వర్మ(5)

    • 3 ఓవర్లకు టీమిండియా స్కోర్ 25/1

  • Feb 15, 2026 19:09 IST

    ఇషాన్ దూకుడు

    • షాహీన్ వేసిన రెండో ఓవర్లో వచ్చిన పరుగులు 15

    • తొలి రెండు బంతుల్లో ఓ ఫోర్, సిక్స్ బాదిన ఇషాన్(12)

    • ఆఖరి బంతికి బౌండరీ కొట్టిన తిలక్ వర్మ(4)

    • 2 ఓవర్లకు టీమిండియా స్కోర్ 16/1

  • Feb 15, 2026 19:03 IST

    టీమిండియాకు షాక్.. అభిషేక్ శర్మ ఔట్

    • తొలి ఓవర్ ఆఖరి బంతికి షాహీన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చిన అభిషేక్ శర్మ(0)

    • సల్మాన్ అఘాకు తొలి వికెట్

    • తొలి ఓవర్ ముగిసే వరకు టీమిండియా స్కోర్ 1/1

  • Feb 15, 2026 19:01 IST

    టీమిండియా బ్యాటింగ్ షురూ

    • క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్

    • తొలి ఓవర్ వేస్తోన్న కెప్టెన్ సల్మాన్ అఘా

  • Feb 15, 2026 18:41 IST

    నో హ్యాండ్ షేక్

    • టాస్ సమయంలో దూరం పాటించిన ఇరు జట్ల కెప్టెన్లు

    • ఆసియా కప్‌లో జరిగినట్లే ఇప్పుడు కూడా నో హ్యాండ్ షేక్

  • Feb 15, 2026 18:40 IST

    భారత తుది జట్టు..

    • టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు

    • అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం

    • సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్ దూరం

    • జట్టు ఇదే: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివం దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా

  • Feb 15, 2026 18:38 IST

    పాకిస్థాన్ తుది జట్టు..

    • సయ్యం ఆయుబ్, ఫర్హాన్, సల్మాన్ ఆఘా(కెప్టెన్), బాబర్ ఆజం, నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ ఆష్రఫ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్

  • Feb 15, 2026 18:34 IST

    టాస్ గెలిచిన పాకిస్థాన్

    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా

    • తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా

  • Feb 15, 2026 18:22 IST

    భారత్-పాక్ మ్యాచ్.. వర్షం అడ్డంకి లేనట్లే!

    • కాసేపట్లో శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికగా తలపడనున్న భారత్-పాకిస్థాన్

    • ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు దాదాపుగా లేనట్లే..

    • ఆకాశం ప్రశాంతంగా మారినట్టు వెల్లడించిన శ్రీలంక వాతావరణ శాఖ