Share News

మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ చెట్టుపై పక్షి ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి!

ABN , Publish Date - Feb 10 , 2026 | 08:26 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.

మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ చెట్టుపై పక్షి ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి!
Optical Illusion

ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


వైరల్ అవుతున్న పై ఫొటో మీ కళ్ల సామర్థ్యాన్ని టెస్ట్‌ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్. ఆ ఫొటోలో ఒక చెట్టు కనబడుతోంది. అది పూర్తిగా ఆకులు, కొమ్మలతో నిండి ఉంది. అయితే ఆ చెట్టు మీద ఒక హమ్మింగ్ బర్డ్ కూడా ఉంది. జాగ్రత్తగా గమనిస్తేనే ఆ పక్షి మీకు కనబడుతుంది. ఆ పక్షిని కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్ల వ్యవధిలో ఆ పక్షిని కనిపెట్టగలిగితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 11 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ చెట్టుపై హమ్మింగ్ బర్డ్ ఎక్కడుందో మీకు తెలుస్తుంది.

puzzle2.jpg


Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 10 , 2026 | 09:34 AM