లోకేశ్ సర్... మా పాఠశాలను కాపాడండి
ABN , Publish Date - Feb 14 , 2026 | 01:42 PM
‘లోకేశ్ సర్..నేను చదువుకున్న పాఠశాల స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారు..మీరైనా కాపాడండి సార్’ అంటూ పూర్వ విద్యార్థిని బి.నాగలక్ష్మి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు వాట్సాప్ ద్వారా లేఖ రాసింది.
విద్యాశాఖ మంత్రికి పూర్వ విద్యార్థిని లేఖ
మదనపల్లె(చిత్తూరు): ‘లోకేశ్ సర్..నేను చదువుకున్న పాఠశాల స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారు..మీరైనా కాపాడండి సార్’ అంటూ పూర్వ విద్యార్థిని బి.నాగలక్ష్మి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)కు వాట్సాప్ ద్వారా లేఖ రాసింది. మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ పాలెంకొండలో 1991లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మంజూరు చేశారని, ఇక్కడ 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపింది. ఇదే పల్లెలో వైసీపీ నేత ఒకరు పాఠశాల ఆవరణలోని 2కుంటల స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్రలు పన్నారని పేర్కొంది.
కొండ నీళ్లను పాఠశాల ఆవరణలోకి మళ్లించాడని, బయో ఫెన్సింగ్ మొక్కలను ఆవులతో మేపించేశాడని వివరించింది. ఈ విషయమై తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని తెలిపింది. పాఠశాల మూతపడితే స్థలాన్ని ఆక్రమించడం సులువు అవుతుందని భావించి టీచర్లను బెదిరిస్తున్నాడని తెలిపింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని తమ ఊరి పాఠశాల స్థలానికి రక్షణ కల్పించి, పాఠశాల మూతపడకుండా చూడాలని కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి:
విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగు
అల్లు వారి.. పెళ్లి పనులు షురూ
Read Latest Telangana News and National News