Share News

సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:55 PM

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై జరుగుతున్న సామాజిక మాధ్యమాల దుష్ప్రచారంపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇలా ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు
Cyber Crime cCase

విజయవాడ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై(Pawan Kalyan) జరుగుతున్న సామాజిక మాధ్యమాల దుష్ప్రచారంపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన లేదా తప్పుదోవ పట్టించే రీతిలో పోస్టులు పెట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.


రాజశేఖర్ రావు అనే వ్యక్తి సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం, మార్ఫింగ్ చేసిన ఫొటోలను ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామన్నారు. ప్రముఖుల ఫొటోలను ఎడిట్ చేసి అసభ్యకరంగా లేదా అగౌరవంగా చిత్రీకరిస్తే.. చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదు.. జగన్ అండ్ కోపై లోకేశ్ ధ్వజం

జగన్ హయాంలో మద్యనిషేధం పేరుతో రేట్లు పెంచారు: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 14 , 2026 | 01:28 PM