Share News

హైదరాబాద్‌ అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:53 AM

అమీర్‌పేటలో అగ్నిప్రమాదం జరిగింది. మైత్రివనంలోని నీలగిరి బ్లాక్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌ అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం
Hyderabad fire accident,

హైదరాబాద్: అమీర్‌పేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మైత్రివనంలోని నీలగిరి బ్లాక్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సంభవించిన భవనం నాలుగో అంతస్తులోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో కొందరు విద్యార్థులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెన సహాయంతో విద్యార్థులను అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చారు అగ్నిమాపక సిబ్బంది.


మరోవైపు మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటల కారణంగా భవనమంతా దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. విద్యుత్ సరఫరాను నిలిపివేసి ప్రమాదం మరింత తీవ్రం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

తేనెటీగల దాడి.. మైదానంలోనే అంపైర్ మృతి

గోదావరి నది పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత: మంత్రి నిమ్మల

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 12:31 PM