Share News

గోదావరి నది పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Feb 20 , 2026 | 09:39 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గోదావరి పుష్కరాల్లో నది కాలుష్యం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు సభలో తెలియజేశారు.

గోదావరి నది పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత: మంత్రి నిమ్మల
Nimmala Ramanaidu

అమరావతి, ఫిబ్రవరి 20: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Session) ఏడో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నది కాలుష్యం జరగకుండా తీసుకునే చర్యలపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయని తెలిపారు. ఈ పుష్కరాల్లో నది పవిత్రతను కాపాడటం సహా కాలుష్యాన్ని నియంత్రించేలా ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందని అన్నారు.


డ్రెయిన్లతో పాటు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం వల్ల నదికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. భక్తుల రద్దీ పెరిగే అంచనాతో స్నాన ఘట్టాల సంఖ్యను పెంచామని వివరించారు. వివిధ శాఖల సమన్వయంతో నది కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి సూచనలను కూడా పాటిస్తామని తెలిపారు. గోదావరి నది పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కొన్ని చోట్ల జంతు కళేబరాలు, పౌల్ట్రీ వ్యర్థాలను నీటి వనరుల్లో కలిపేస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని నిమ్మల రామానాయుడు అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి...

నిజాయితీ, పారదర్శకతలే హెరిటేజ్‌కు పునాది

తేనెటీగల దాడి.. మైదానంలోనే అంపైర్ మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 10:53 AM