Share News

తేనెటీగల దాడి.. మైదానంలోనే అంపైర్ మృతి

ABN , Publish Date - Feb 20 , 2026 | 06:40 AM

అండర్ 13 మ్యాచ్‌లో అంపైర్ అనూహ్యంగా మరణించారు. మ్యాచ్ జరుగుతుండగానే తేనెటీగల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో కాన్పూర్ క్రికెట్ సంఘం(కేసీఏ) సీనియర్ అంపైర్ మాణిక్ గుప్తా(65) ప్రాణాలు కోల్పోయారు.

తేనెటీగల దాడి.. మైదానంలోనే అంపైర్ మృతి
Umpire

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ మైదానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అండర్ 13 మ్యాచ్‌లో అంపైర్ అనూహ్యంగా మరణించారు. మ్యాచ్ జరుగుతుండగానే తేనెటీగల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో కాన్పూర్ క్రికెట్ సంఘం(కేసీఏ) సీనియర్ అంపైర్ మాణిక్ గుప్తా(65) ప్రాణాలు కోల్పోయారు. యూపీలోని ఉన్నావ్ జిల్లా శుక్లాగంజ్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.


వైఎంసీసీ, పారామౌంట్ జట్ల మధ్య కేడీఎంఏ లీగ్ మ్యాచ్‌లో జగదీశ్ శర్మ, మాణిక్ గుప్తా అంపైర్లుగా వ్యవహరించారు. మ్యాచ్ జరుగుతుండగా తేనెటీగల గుంపు మైదానంలోని అంపైర్లు, ఆటగాళ్లపై దాడి చేసింది. సుమారు 10 నిమిషాల పాటు అవి బీభత్సం సృష్టించాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆటగాళ్లు, అధికారులు పరుగులు తీశారు. ఈ క్రమంలో మాణిక్‌తోపాటు మరో అంపైర్, పలువురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్న మాణిక్‌ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా.. ఆయన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా సుమారు 30 ఏళ్లుగా కేసీఏ అంపైర్ ప్యానెల్‌లో మాణిక్ సభ్యుడిగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

షేక్ అవుతున్న అభిషేక్ శర్మ.. వరుసగా మూడోసారి డకౌట్..

నువ్వు అద్భుతం.. పాకిస్థాన్ ప్లేయర్‌పై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు

Updated Date - Feb 20 , 2026 | 07:42 AM