Share News

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:32 PM

సమా జంలో జరుగుతున్న సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రులను చైతన్య వంతులను చేయాలని రామగుండం కమిషనరేట్‌ షీ టీమ్‌ ఇన్‌చార్జి స్నేహలత అన్నారు. పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్‌లో శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సమా జంలో జరుగుతున్న సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రులను చైతన్య వంతులను చేయాలని రామగుండం కమిషనరేట్‌ షీ టీమ్‌ ఇన్‌చార్జి స్నేహలత అన్నారు. పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్‌లో శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. విద్యార్థులనుద్ధేశించి మాట్లాడుతు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉం డేందుకు పలు సలహాలు సూచనలు అందజేశారు. మహిళ భద్రతపై కూడా అవగాహన కల్పిస్తూ ఎవరైనా చెడుగా మాట్లాడినా ప్రవర్తించినా గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ వంటి వాటిని వెంటనే స్కూల్‌లో టీచర్లకు, తల్లిదం డ్రులకు చెప్పాలన్నారు. మహిళల రక్షణ కోసం భద్రత కోసం తమ షీ టీమ్‌ బృందాలు ఆయా పట్టణాలు, గ్రామాల్లోని ముఖ్య కూడల్లలో నిరంతరం నిఘా ఉంటారన్నారు. ఏదైనా ఆపద సమ యంలోగానీ, ఎవరైనా వేధిస్తుంటే వెంటనే 6303923700 నెంబర్‌కు కాల్‌ చేయాలన్నారు. సైబర్‌ నేరాలకు సంబందించి 1930 నంబర్‌కు కాల్‌ చేయా లన్నారు. షీ టీమ్‌ ప్రతినిదులు మౌనిక, స్కూల్‌ హెచ్‌ఎం పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:32 PM