శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:30 PM
మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీవో పొల్సాని శశికళ అధ్యక్షతన జరుగుతున్న వార్డుసభ్యుల శిక్షణ తరగ తులకు శుక్రవారం ఎస్‌ఐ నూతి శ్రీధర్ హాజర య్యారు. ఆయన వార్డు సభ్యులతో మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతిని ధులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
పాలకుర్తి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీవో పొల్సాని శశికళ అధ్యక్షతన జరుగుతున్న వార్డుసభ్యుల శిక్షణ తరగ తులకు శుక్రవారం ఎస్‌ఐ నూతి శ్రీధర్ హాజర య్యారు. ఆయన వార్డు సభ్యులతో మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతిని ధులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సాగు, విక్రయాల నిర్మూలనకు సహకరించాలన్నారు. ఇతర చట్టవ్యతి రేక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. గ్రామాల్లో ఏదైనా సమస్య తలెత్తిన ప్పుడు పోలీసుల దృష్టికి తీసుకురావాలని, తద్వారా శాంతియుత వాతా వరణాన్ని నెలకొల్పవచ్చని పేర్కొన్నారు. గ్రామ రక్షణ, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎంపీవో ఉప్పు సుదర్శన్, మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్‌కుమార్, వార్డు సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
గ్రామీణ అభివృద్ధి పాలకుల చేతుల్లోనే
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధి పాల కుల చేతుల్లోనే ఉంటుందని మహిళా సాధికారిత కేంద్రం కో ఆర్డినేటర్ దయ అరుణ, పోషన్ అభియాన్ కోఆర్డినేటర్ కే అనిల్‌కుమార్ అన్నారు. బ్రాహ్మణ పల్లి గ్రామ పరిధిలోని రైతువేదికలో నిర్వహిస్తున్న సర్పంచులు, వార్డు సభ్యుల శిక్షణ తరగతులలో శుక్ర వారం మహిళా శిశు సంక్షేమ శాఖ సేవల గురించి అవగాహన కల్పించారు. ఎంపీఢీఓ తిరుపతి, ఎంపీఓ వేణు మాధవ్, సరస్వతి, విజయ, సువర్ణ పాల్గొన్నారు.