ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 21 , 2026 | 07:29 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Feb 21, 2026 10:44 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
సీఎం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను పరిశీలించాం: రామ్మోహన్
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతం: రామ్మోహన్
మేము కూడా మా శాఖలో కేంద్రం ప్రారంభించాలని ప్రయత్నం చేశాం: రామ్మోహన్
-
Feb 21, 2026 10:42 IST
ఢిల్లీలో హైఅలర్ట్... ఉగ్రముప్పు ఉందని నిఘావర్గాల హెచ్చరికలు
ఢిల్లీలో దాడులకు లష్కరే తోయిబా ప్లాన్ చేసినట్లు సమాచారం
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడులకు కుట్ర
ఎర్రకోట, చాందినీచౌక్‌లోని ఆలయం దగ్గర IMD పేలుళ్లకు ప్రణాళికలు
ఢిల్లీలో వీవీఐపీ ప్రాంతాల వద్ద భద్రత కట్టుదిట్టం
-
Feb 21, 2026 10:01 IST
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు: వెంకయ్యనాయుడు
మన అస్తిత్వానికి సుస్థిర కోట నిర్మించేది మన మాతృభాషే: వెంకయ్య
మనకంటూ గర్వంగా చెప్పుకోవడానికి ఉంది మన భాష, సంస్కృతులే: వెంకయ్య
-
Feb 21, 2026 09:09 IST
హైదరాబాద్: FSL అగ్నిప్రమాదం కేసులో కీలక మలుపు
దగ్ధమైన ఫైళ్లు రిట్రీవ్ చేయలేమని తేల్చిన నాగపూర్ బృందం
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో 1,100ల ఫైళ్లు దగ్ధమైనట్లు అనుమానం
కేసుల డేటా రిట్రీవ్‌కు ప్రయత్నం చేసిన సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్
-
Feb 21, 2026 07:57 IST
నేటి నుంచి వికారాబాద్‌లో కాంగ్రెస్ శిక్షణ తరగతులు
అనంతగిరిలో ఏపీ, తెలంగాణ DCC అధ్యక్షులకు శిక్షణ
10 రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
పాల్గొననున్న మహేష్ గౌడ్, షర్మిల, మంత్రులు, కీలక నేతలు
మార్చి 1న ముగింపు సమావేశానికి హాజరుకానున్న రాహుల్ గాంధీ
-
Feb 21, 2026 07:33 IST
టీ20 వరల్డ్ కప్ అప్డేట్
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో పాకిస్థాన్ Vs న్యూజిలాండ్
కొలంబోలో ఇవాళ రాత్రి 7గంటలకు మ్యాచ్
-
Feb 21, 2026 07:29 IST
భివాండి కోర్టుకు కాంగ్రెస్ అగ్రనేత
మహారాష్ట్ర: నేడు భివాండి కోర్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
RSSకు సంబంధించిన పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరుకానున్న రాహుల్ గాంధీ