అతివేగంతో స్కూటీని ఢీకొన్న కారు.. డెలివరీ బాయ్ మృతి..
ABN , Publish Date - Feb 21 , 2026 | 10:41 AM
దేశ రాజధాని ఢిల్లీలో వేగంగా వెళ్తున్న కారు.. స్కూటీని ఢీకొట్టడంతో డెలివరీ బాయ్ అక్కడిక్కడే మృతిచెందాడు. శనివారం ఉదయం ఢిల్లీలోని సుభాష్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ(Delhi)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతివేగం ఒక అమాయకుడి ప్రాణం తీసింది. ఢిల్లీలోని సుభాష్ నగర్‌లో వేగంగా వస్తున్న కారు.. బైక్‌ను ఢీకొట్టడంతో 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ సమయంలో కారు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడైన కారు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం.. బాధిత యువకుడు ఓ ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తన ఎలక్ట్రిక్ స్కూటీపై ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్తుండగా.. వెనక నుంచి అతివేగంగా వచ్చిన హుందాయ్ వెర్నా(Hyundai Verna) కారు బలంగా ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. దర్యాప్తులో భాగంగా దెబ్బతిన్న ఎలక్ట్రిక్ స్కూటర్, ప్రమాదానికి కారణమైన కారు రెండింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?