Share News

భారత ఎగుమతులకు మళ్లీ జోష్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:17 AM

ట్రంప్‌ ప్రతీకార సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో భారత ఎగుమతులకు మళ్లీ జోష్‌ రానుంది. ముఖ్యంగా భారత్‌ నుంచి వస్త్రాలు, పలు రకాల వ్యవసాయ ఉత్పత్తులు...

భారత ఎగుమతులకు మళ్లీ జోష్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ట్రంప్‌ ప్రతీకార సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో భారత ఎగుమతులకు మళ్లీ జోష్‌ రానుంది. ముఖ్యంగా భారత్‌ నుంచి వస్త్రాలు, పలు రకాల వ్యవసాయ ఉత్పత్తులు, రొయ్యలు, రత్నాలు-ఆభరణాలు, వాహన విడిభాగాలు, యంత్ర పరికరాల పరిశ్రమలు, ఎగుమతిదారులకు ప్రయోజనం కలగనుంది. ప్రతీకార సుంకాల రద్దుతో అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల ధరలు తగ్గి, డిమాండ్‌ ఊపందుకునే అవకాశముంది.

పాత టారిఫ్‌లు మూడు శాతమే..

ప్రతీకార సుంకాల కొట్టివేతతో భారత ఉత్పత్తులపై అంతకుముందటి యాంటీ డంపింగ్‌, కౌంటర్‌ వెయిలింగ్‌, జాతీయ భద్రత ఆధారిత టారి్‌ఫలు కొనసాగనున్నాయి. సుమారు రూ.75.3 వేల కోట్ల (8.3 బిలియన్‌ డాలర్లు) విలువైన ఉత్పత్తులకు అవి వర్తించనున్నాయి. అమెరికాకు భారత మొత్తం ఎగుమతులు రూ.7.26 లక్షల కోట్ల (80 బిలియన్లు)లో.. పాత సుంకాలు వర్తించే ఉత్పత్తుల విలువ సుమారు 10.4శాతమే. ప్రతీకార సుంకాల తరహాలో కాకుండా.. ఆయా ఉత్పత్తులను, రకాలను బట్టి వేర్వేరుగా ఆ టారి్‌ఫలు వర్తిస్తాయి. ఆ టారి్‌ఫలన్నీ కూడా ట్రంప్‌ సుంకాల కంటే చాలా తక్కువ. సగటున మొత్తం భారత ఉత్పత్తులపై సుంకాలు 3.3 శాతమే. అదే వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్‌వర్క్‌పై ప్రకటన సందర్భంగా చెప్పిన సుంకాలు ఏకంగా 18శాతం కావడం గమనార్హం.


ఆయా ఉత్పత్తులపై పాత టారిఫ్‌లు ఇవీ..

డబ్ల్యూటీవోలో భారత్‌ సభ్యదేశం కావడంతో.. అమెరికా భారత్‌కు ‘మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ (ఎంఎఫ్ఎన్‌)’ హోదా ఇచ్చింది. దాని ప్రకారం చాలా ఉత్పత్తులపై టారి్‌ఫలు ఉండవు. కొన్నింటిపై మాత్రం ఉత్పత్తులు, వాటి ఉప ఉత్పత్తులకు విడివిడిగా ప్రత్యేక టారి్‌ఫలు వర్తిస్తాయి. భారత ఎగుమతుల్లో సగటున ఫార్మాపై 1.0శాతం, రసాయనాలపై 7శాతం, ఎలక్ట్రానిక్స్ పై 0.45శాతం, యంత్రాలు, కంప్యూటర్లపై 1.3శాతం, వస్త్రాలపై 9శాతం, ప్లాస్టిక్‌, కళాకృతులపై 8శాతం, రత్నాలు-ఆభరణాలపై 2.1శాతం, ఇనుము, ఉక్కుపై 5శాతం, ఖనిజాలు, పెట్రోలియం ఉత్పత్తులపై 7శాతం వరకు పాత టారిఫ్‌లు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ట్రంప్‌ సుంకాలు చెల్లవ్‌!

అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?

Updated Date - Feb 21 , 2026 | 06:49 AM