Share News

రెండు పడవలు ఢీ.. తప్పిన పెను ముప్పు.. వీడియో వైరల్

ABN , Publish Date - Feb 21 , 2026 | 07:07 AM

ఉత్తరాఖండ్ పౌరి జిల్లాలోని ధరి దేవి ఆలయం సమీపంలోని అలకనంద నదిలో రెండు పడవలు ఎదురెదురు‌గా ఢీకొన్నాయి. వివరాల్లోకి వెళితే..

రెండు పడవలు ఢీ.. తప్పిన పెను ముప్పు.. వీడియో వైరల్
Boat Collision Alaknanda River

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్(Uttarakhand) పౌరి జిల్లాలోని ధరి దేవి ఆలయ సమీపంలోని అలకనంద నది(Alaknanda River)లో రెండు పడవలు ఎదురెదురు‌గా ఢీకొనడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఓ వ్యక్తి నదిలో దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. అలకనంద నదిలో రెండు పడవల్లో పర్యాటకులు ప్రయాణిస్తున్నారు. అయితే, ఒక పడవ అదుపు తప్పి మరో పడవకు ఎదురుగా వెళ్లింది. దాంతో ఎదురుగా వచ్చిన పడవ ఆపరేటర్ దాని పై నుంచి తీసుకువెళ్లాడు.


ఈ ఘటనలో పడవ ఆపరేటర్లలో ఒక వ్యక్తి భయంతో నదిలో దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో పడవలోని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే, అదుపుతప్పిన పడవ నదిలో కొద్దిసేపటి వరకు చుట్టూ చక్కర్లు కొట్టింది. తర్వాత ఆపరేటర్ దాన్ని కంట్రోల్‌లోకి తీసుకువచ్చాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రెండు పడవ నుంచి ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

అమెరికా ఆధ్వర్యంలోని కీలక కూటమిలో భారత్ చేరిక

రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

Updated Date - Feb 21 , 2026 | 08:12 AM