నా బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు: అభిషేక్ శర్మ
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:51 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్‌గానే పెవిలియన్ చేరాడు. అయితే తన వరుస డకౌట్లపై అభిషేక్ తాజాగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్‌గానే పెవిలియన్ చేరాడు. ఇతడి ఫామ్‌పై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అభిషేక్ శర్మ ప్రదర్శన ఒక్కసారిగా ఇలా పడిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా సూపర్ 8లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు అభిషేక్ శర్మ వరుస డకౌట్లపై స్పందించాడు.
‘నాకు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. రెండేళ్ల క్రితం నుంచే ఇలాంటి చిన్న విషయాలకు ఒత్తిడి తీసుకోవడం మానేశా. నేను నా హార్డ్ వర్క్‌ని మాత్రమే నమ్ముతా. మన చేతిలో ఉండేది కేవలం ప్రాక్టీస్, ట్రైనింగ్ అంతే. వాటినే నేను కొనసాగిస్తా. కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. కొన్ని ఇన్నింగ్స్‌ల్లో పరుగులు వస్తాయి.. కొన్నిసార్లు రావు. కానీ నేను నిర్ణయించుకున్నది మాత్రం ఒక్కటే.. ఏమి జరిగినా నా బ్యాటింగ్ శైలిలో మార్పు ఉండొద్దని! ఫలితం రాకపోయినా నా ఆటతీరును మార్చను. ఇదే దూకుడును కొనసాగిస్తా’ అని అభిషేక్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో మూడో టీ20: స్మృతి, జెమీమా హాఫ్ సెంచరీలు.. ఆసీస్ టార్గెట్ 177
బీసీసీఐకి ఏదీ అనుకూలంగా లేదు.. గ్రూపింగ్ అంశంపై ఆకాశ్ చోప్రా ఆగ్రహం