ఒత్తిడిలో టీమిండియా బలహీనపడుతుంది: సౌతాఫ్రికా కోచ్ షుక్రి
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:13 PM
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ప్రొటీస్ కోచ్ షుక్రి కాన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి. గ్రూప్ స్టేజిలో ఇరుజట్లూ ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా నిలిచాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ప్రొటీస్ కోచ్ షుక్రి కాన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉందని అన్నాడు.
‘భారత్ మీదే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సెమీ ఫైనల్స్ చేరుకునే విషయంలో వారిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వారు ఫైనల్‌కు కూడా చేరుకుంటారు. కానీ ఆ అంచనాల వల్లే ప్లేయర్లు ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడిలో బలహీనపడతారు. నిజానికి మా ఇరు జట్ల మీదా ఒత్తిడి ఉంటుంది. కానీ భారత్‌పై కాస్త ఎక్కువ ఉంది’ అని షుక్రి అన్నాడు.
అభిషేక్ శర్మ వరుస డకౌట్లపై కూడా షుక్రి స్పందించాడు. ‘మేమంతా అత్యుత్తమ జట్టుతో మ్యాచ్ ఆడితే ఉండే ఒత్తిడి గురించే మాట్లాడుతున్నాం. నిజానికి వారు ఏ ఒత్తిడిలో ఉన్నారో తెలియదు. తాను ఆడిన మూడు మ్యాచుల్లో వరుసగా డకౌట్ అయిన వ్యక్తి, జట్టులో స్థానం గురించి పడే ఒత్తిడి గురించి నేను మాట్లాడటం లేదు’ అని వివరించాడు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో మూడో టీ20: స్మృతి, జెమీమా హాఫ్ సెంచరీలు.. ఆసీస్ టార్గెట్ 177
బీసీసీఐకి ఏదీ అనుకూలంగా లేదు.. గ్రూపింగ్ అంశంపై ఆకాశ్ చోప్రా ఆగ్రహం