Share News

భారత్‌తో మూడో టీ20: స్మృతి, జెమీమా హాఫ్ సెంచరీలు.. ఆసీస్ టార్గెట్ 177

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:33 PM

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు అడిలైడ్ వేదికగా ఆఖరి టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మహిళలు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేశారు. ఆతిథ్య ఆసీస్‌కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

భారత్‌తో మూడో టీ20: స్మృతి, జెమీమా హాఫ్ సెంచరీలు.. ఆసీస్ టార్గెట్ 177
India Women vs Australia Women

ఇంటర్నెట్ డెస్క్: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు అడిలైడ్ వేదికగా ఆఖరి టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మహిళలు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేశారు. ఆతిథ్య ఆసీస్‌కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. స్మృతి మంధాన(82; 55 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్(59; 46 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.


రిచా ఘోష్(18; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించింది. షఫాలీ వర్మ(7) విఫలమైంది. బెత్ మూనీ వేసిన ఆఖరి ఓవర్లో అమన్ జ్యోత్ కౌర్(1), దీప్తి శర్మ(1) వెనువెంటనే రనౌట్ అవ్వడం గమనార్హం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(2*) నాటౌట్‌గా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో అనెబెల్ సదర్లాండ్ 2, సోఫీ, కిమ్ గాత్ తలొక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే భారత్-ఆసీస్ తలో మ్యాచ్ గెలిచి 1-1 తేడాతో సమానంగా ఉన్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

సూపర్ 8 వేళ పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ ఆడకుండానే..!

ఇక సూపర్‌ ఫైట్‌

Updated Date - Feb 21 , 2026 | 03:33 PM