తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ABN , Publish Date - Feb 21 , 2026 | 09:51 AM
తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కేంద్రమంత్రి పరిశీలించారు.
తిరుపతి, ఫిబ్రవరి 21: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) ఈరోజు(శనివారం) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని (Tirumala Temple) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు కేంద్రమంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించిన ఆయన దానిని అద్భుతంగా ఉందని అభివర్ణించారు.
అధునాతన టెక్నాలజీని వినియోగించి టీటీడీ.. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందన్నారు కేంద్రమంత్రి. త్వరలోనే ఈ మోడల్‌పై పూర్తి అధ్యయనం చేసి సివిల్ ఏవియేషన్ రంగంలో కూడా ఇలాంటి అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో సివిల్ ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు.
2014లో దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం అవి 165కి పెరిగాయని రామ్మోహన్ నాయుడు వివరించారు. రాబోయే 20 సంవత్సరాల్లో ఏటా 10 శాతం వృద్ధి చెంది ఈ రంగం మరింత ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీటీడీ కల్పిస్తున్న అత్యుత్తమ సౌకర్యాలపై భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అలాగే, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి...
పీఎస్ఎల్వీ-సీ62 వైఫల్యంపై విశ్లేషణ కమిటీ
27 నుంచి ఇస్రో ‘యువికా’ రిజిస్ర్టేషన్లు
Read Latest AP News And Telugu News