Share News

లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ..

ABN , Publish Date - Feb 21 , 2026 | 01:48 PM

ప్రేమికుల మధ్య చోటుచేసుకున్న గొడవ పెను విషాదానికి దారి తీసింది. ఆ గొడవ కారణంగా ప్రియుడు, ప్రియురాలు ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖలో శుక్రవారం చోటుచేసుకుంది.

లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ..
Shyam Kumar Bhimli lodge

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రేమికుల మధ్య చోటుచేసుకున్న గొడవ పెను విషాదానికి దారి తీసింది. ఆ గొడవ కారణంగా ప్రియుడు, ప్రియురాలు ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖలో శుక్రవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యామ్ కుమార్, పావని ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్యా గొడవ కారణంగా పావని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో శ్యామ్ కుమార్ భయపడిపోయాడు.


విశాఖపట్నం పారిపోయి వచ్చాడు. భీమిలిలోని ఓ లాడ్జిలో రూము తీసుకున్నాడు. పావని మృతి చెందిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్న శ్యామ్ కుమార్ శుక్రవారం మద్యంలో విషం కలుపుకుని తాగి ప్రాణాలు తీసుకున్నాడు. శుక్రవారం మద్యాహ్నం నుంచి శ్యామ్ రూము తలుపులు తీయకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చింది. స్పేర్ కీతో తలుపులు తీసి చూశారు. శ్యామ్ కుమార్ విగతజీవిగా కనిపించాడు. లాడ్జి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జికి చేరుకున్నారు.


శ్యామ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూము నుంచి రెండు సూసైడ్ నోట్లు, ఎలుకల మందు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. శ్యామ్ కుమార్ సూసైడ్ నోట్‌లో..‘నా చావుకు ఎవరూ కారణం కాదు. సారీ అమ్మ’ అని రాసుకొచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

చిత్తూరు అబ్బాయి.. అమెరికా అమ్మాయి

సుంకాల డబ్బును తిరిగివ్వండి! ట్రంప్‌నకు అమెరికన్ల డిమాండ్

Updated Date - Feb 21 , 2026 | 01:58 PM