Share News

చిత్తూరు అబ్బాయి.. అమెరికా అమ్మాయి

ABN , Publish Date - Feb 21 , 2026 | 01:44 PM

అబ్బాయి చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన కిషన్‌కిరణ్‌ తోమాల. అమెరికాలోని టెక్సాస్‏లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు. అమ్మాయి మియా సమంతా హెర్నాండెజ్‌. ఈమెది టెక్సాస్‌. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.

చిత్తూరు అబ్బాయి.. అమెరికా అమ్మాయి

  • వైష్ణవ సంప్రదాయం ప్రకారం వివాహం

చిత్తూరు: అబ్బాయి చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన కిషన్‌కిరణ్‌ తోమాల. అమెరికాలోని టెక్సాస్‏లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు. అమ్మాయి మియా సమంతా హెర్నాండెజ్‌. ఈమెది టెక్సాస్‌. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. రెండువైపులా తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లూ పెళ్లికి అంగీకరించారు. ఆరునెలల క్రితం అమెరికాలో నిశ్చితార్థం జరిగింది. ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు వైష్ణవ సంప్రదాయం ప్రకారం చిత్తూరు సమీపంలోని రిసార్ట్సులో మూడు రోజులపాటు వీరి పెళ్లి జరిగింది.


zzzzzzzzzzz.jpgకాగా, అబ్బాయి తల్లిదండ్రులు పూజారి రెడ్డి మురళీధర్‌, గీతాగాయత్రి చిత్తూరులో ప్రభుత్వ ఉపాధ్యాయులు. తమ ఇద్దరు కుమారుల చదువు కోసం తమ ఉద్యోగాలను వదిలి అమెరికా వెళ్లారు. పెద్ద కుమారుడు కిషన్‌కిరణ్‌ తోమాల సాఫ్ట్‌వేర్‌.. చిన్నకుమారుడు అమెజాన్‌ కంపెనీలో చేరారు. అక్కడే వీరి కుటుంబం స్థిరపడింది. మురళీధర్‌ తల్లిదండ్రులు చిత్తూరులో ఉండేవారు. రెండేళ్ల కిందట అతడి తల్లి చనిపోయింది. తండ్రి ఒక్కరే కావడంతో.. మురళీధర్‌ దంపతులు చిత్తూరుకు వచ్చేశారు. పెళ్లి కుమార్తె కుటుంబీకులను ఒప్పించి తమ పెద్ద కుమారుడి పెళ్లిని చిత్తూరులో జరిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

డ్రగ్స్‌పై ఈగల్ టీం ఉక్కుపాదం.. గంజాయి సాగును నిర్మూలించాం: ఐజీ రవికృష్ణ

పీఎస్ఎల్వీ-సీ62 వైఫల్యంపై విశ్లేషణ కమిటీ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2026 | 01:44 PM