మంత్రి నెహ్రూపై కేసు నమోదు చేయండి
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:37 PM
పురపాలక మంత్రిత్వ శాఖలో లంచం తీసుకుని ఉద్యోగ నియామకాలు జరిగా యనే ఆరోపణలు, టెండర్లలో అక్రమాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం (ఈడీ) అందించిన ఆధారాల ప్రకారం నగరపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ తదితరులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఏసీబీకి మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
ఏసీబీకి హైకోర్టు ఆదేశం
చెన్నై: పురపాలక మంత్రిత్వ శాఖలో లంచం తీసుకుని ఉద్యోగ నియామకాలు జరిగా యనే ఆరోపణలు, టెండర్లలో అక్రమాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం (ఈడీ) అందించిన ఆధారాల ప్రకారం నగరపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ తదితరులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఏసీబీకి మద్రాసు హైకోర్టు ఆదేశించింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషఫన్ విభాగంలో ఉద్యోగ నియామకాలకు ముడుపులు స్వీకరించిన వ్యవహారం,టెండర్ల కేటాయింపులలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించి మంత్రి నెహ్రూ, ఇతరులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఇదివరకే ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీపీకి లేఖ పంపింది.
ఈడీ పంపిన ఆధారాల ప్రకారం కేసు నమోదు చేసి మంత్రి నెహ్రూపై విచారణ జరిపేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ అన్నాడీఎంకే ఎంపీ ఇన్బదురై, ఆదినారాయణన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎంఎం శ్రీవాత్సవ, న్యాయమూర్తి జస్టీస్ జి అరుళ్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అదే సమయంలో మరో కేసులో సేకరించిన ఆధారాలను డీజీపీకి పంపామని, వాటి ఆధారంగా మంత్రిపై కేసు నమోదు చేసేలా ఉత్తర్వులివ్వాలని ఈడీ మరో పిటిషన్ వేసింది.
ఈడీ పంపిన లేఖ ప్రభుత్వ పరిశీలనకు పంపి, ఆ తదుపరి ఏసీబీ విచారణకు ఉత్తర్వులు జారీ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ధర్మాసనం ఈ పిటిషన్‌పై అందరి వాదప్రతివాదనలను పరిశీలించిన అనంతరం ఈడీ సమర్పించిన ఆధారాల్లో పురపాలక మంత్రిత్వ శాఖలో అవినీతి జరిగినట్లు సాక్ష్యాధారాలుండడం వలన కేసు నమోదు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించారు. ఈడీ సమర్పించిన ఆధారాలను బట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ధర్మాసనం, ఆదినారాయణన్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి:
గుర్రాలు, గాడిదలు పెంచేందుకు లైసెన్స్ తప్పనిసరి
ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హైఅలర్ట్..
Read Latest Telangana News and National News