Share News

గుర్రాలు, గాడిదలు పెంచేందుకు లైసెన్స్‌ తప్పనిసరి

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:11 PM

నగరంలో గుర్రాలు, గాడిదలు పెంచడానికి తప్పకుండా కార్పొరేషన్‌ నుంచి లైసెన్స్‌లు పొందాల్సి ఉంటుందని గ్రేటర్‌ చెన్నై మేయర్‌ ఆర్‌ ప్రియా ప్రకటించారు. రిప్పన్‌భవనం సమావేశ మందిరంలో మేయర్‌ ప్రియ అధ్యక్షతన శుక్రవారం కార్పొరేషన్‌ సాధారణ సమావేశం జరిగింది.

గుర్రాలు, గాడిదలు పెంచేందుకు లైసెన్స్‌ తప్పనిసరి

  • చెన్నై కార్పొరేషన్‌ మీట్‌లో నిర్ణయం

చెన్నై: నగరంలో గుర్రాలు, గాడిదలు పెంచడానికి తప్పకుండా కార్పొరేషన్‌ నుంచి లైసెన్స్‌లు పొందాల్సి ఉంటుందని గ్రేటర్‌ చెన్నై మేయర్‌ ఆర్‌ ప్రియా ప్రకటించారు. రిప్పన్‌భవనం సమావేశ మందిరంలో మేయర్‌ ప్రియ అధ్యక్షతన శుక్రవారం కార్పొరేషన్‌ సాధారణ సమావేశం జరిగింది. కమిషనర్‌ కుమారగురుబరన్‌, డిప్యూటీ మేయర్‌ మహేష్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేషన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలపై స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, జోనల్‌ కమిటీ నేతలు, సిట్రరసు, ఇళయ అరుణా, తనియరసు, నందగోపాల్‌, రవిచంద్రన్‌, విశ్వనాథన్‌, నందిని సహా 37 మంది కార్పొరేటర్లు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


nani1.2.jpgజోనల్‌ కమిటీ సభ్యుడు దురైరాజ్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఉన్నత విద్యలో 50 శాతం అభివృద్ధి సాధించిందని, మహిళలు వెలుగుబాటపయనం, గృహిణులు సాధికారికనగదు పథకం తదితర పథకాల ద్వారా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటున్నారని తెలిపారు. కార్పొరేషన్‌ బడ్జెట్‌లో దీర్ఘకాలిక పథకాలకు నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. కార్పొరేషన్‌ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా, కరాటే శిక్షణ కోసం భారీగా నిధులు కేటాయించడం ప్రశసంనీయమని కార్పొరేటర్‌ నేతాజీ గణేశన్‌ కనియాడారు.


nani1.3.jpgతర్వాత మేయర్‌ ఈ సమావేశంలో చేసిన కీలకమైన తీర్మానాలను వివరించారు. ఆమేరకు కార్పొరేషన్‌ పరిధిలో పెంచుతున్న గుర్రాలు, గాడిదలకు ఇకపై లెసెన్స్‌ తప్పనిసరని, అదే విధంగా మెరీనాబీచ్‌లో పర్యాటకుల కోసం గు ర్రాలను ఉదయం 10నుండి సాయంత్రం 4 గంటల వరకూ నడుపకూడదన్నారు. గుర్రాలు, గాడిదలకు లైసెన్సు మంజూరు చేసేటప్పుడే వాటికి మైక్రో చిప్‌లు అమర్చుతామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హైఅలర్ట్..

ద్వైపాక్షిక చర్చలు.. సీఈవోలతో మంతనాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2026 | 12:11 PM