దిగుమతులపై 10 శాతం సుంకం.. ప్రకటించిన శ్వేతసౌధం
ABN , Publish Date - Feb 21 , 2026 | 10:57 AM
సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు తరువాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తామని తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో ట్రంప్ ప్రభుత్వానికి తాజాగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే, గతంలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలపై 10 శాతం సుంకం అమలవుతుందని శ్వేత సౌధం తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం శ్వేత సౌధం ఈ ప్రకటన విడుదల చేసింది.
ఇష్టారీతిన సుంకాలను విధించడం చెల్లదంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన చేశారు. దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఫిబ్రవరి 24 నుంచి ఈ సుంకం అమల్లోకి రానుంది. అయితే, ఫార్మాతో పాటు ఇతర రంగాలకు సంబంధించిన దిగుమతులపై గతంలో ఇచ్చిన మినహాయింపులు కొనసాగుతాయని కూడా శ్వేత సౌధం పేర్కొంది.
వాణిజ్య ఒప్పందాల తరువాత కూడా అధిక సుంకాలను ఎదుర్కొంటున్న దేశాలపై కూడా 10 శాతం సుంకమే అమలవుతుందని కూడా శ్వేత సౌధం పేర్కొంది. అయితే, వాణిజ్య ఒప్పందాల ప్రకారమే సుంకాల విధించే మార్గాల కోసం ట్రంప్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సుప్రీం కోర్టు తీర్పు తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కూడా స్పందించారు. డీల్ కొనసాగుతుందని అన్నారు. భారత్‌యే సుంకాలను చెల్లిస్తుందని తెలిపారు. అమెరికాకు ఎలాంటి భారం ఉండదని అన్నారు. ఇది గతంతో పోలిస్తే భిన్నమైన పరిస్థితి అని అన్నారు.
ఈ వార్తలూ చదవండి: