ఇరాన్‌పై పరిమిత దాడి: ట్రంప్
ABN , Publish Date - Feb 21 , 2026 | 02:14 AM
అమెరికాతో అణు చర్చల తర్వాత కొద్దిరోజుల్లో ప్రతిపాదిత ఒప్పందం సిద్ధమవుతుందని ఇరాన్ భావిస్తున్నట్లు ఆ దేశ దౌత్యవేత్త చెప్పినప్పటికీ..
వాషింగ్టన్, ఫిబ్రవరి 20: అమెరికాతో అణు చర్చల తర్వాత కొద్దిరోజుల్లో ప్రతిపాదిత ఒప్పందం సిద్ధమవుతుందని ఇరాన్ భావిస్తున్నట్లు ఆ దేశ దౌత్యవేత్త చెప్పినప్పటికీ.. ఇరాన్‌పై పరిమిత దాడులు సాధ్యమేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై పరిమిత సైనిక దాడి విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అణు ఒప్పందం విషయమై ఇరు దేశాల మధ్య చర్చలు జరగుతున్న క్రమంలో ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పరిమిత దాడికి ప్రయత్నిస్తారా అంటూ ట్రంప్‌ను ఓ జర్నలిస్టు అడగ్గా.. ‘అవును.. ఆ విషయాన్ని పరిశీలిస్తున్నాను’ అని చెప్పారు. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రాబోయే రెండు, మూడు రోజుల్లో ముసాయిదా ఒప్పందాన్ని ఖరారు చేయాలని చూస్తున్నాం. అది పూర్తవ్వగానే వాషింగ్టన్‌కు పంపాలని యోచిస్తున్నాం’ అని అన్నారు.