Share News

ప్రభాస్‌తో మామూలుగా ఉండదు.. విమానంలో ఫుడ్ డెలివరీ

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:15 AM

హీరో ప్రభాస్ తన తోటి నటులకు, సినిమా టీమ్‌కు ఇంటి నుంచి భోజనం తెప్పిస్తూ ఉంటారు. తనకు ఇష్టమైన ఆహారాన్ని వేరే రాష్ట్రాలనుంచి ఆర్డర్ పెట్టుకుని మరీ తింటూ ఉంటారు. ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న ప్రభాస్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు.

ప్రభాస్‌తో మామూలుగా ఉండదు.. విమానంలో ఫుడ్ డెలివరీ
Prabhas Chennai food flight

ఇంటర్‌నెట్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భోజన ప్రియుడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎక్కువగా ఇంటి భోజనం తినడానికి ఇష్టపడతారు. హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో షూటింగ్‌లు ఉంటే ఇంటి నుంచి షూటింగ్ స్పాట్‌లకు భోజనం వస్తుంది. తన తోటి నటులకు, సినిమా టీమ్‌కు కూడా ఆయన ఇంటి నుంచి భోజనం తెప్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తనకు ఇష్టమైన ఆహారాన్ని వేరే రాష్ట్రాలనుంచి ఆర్డర్ పెట్టుకుని మరీ తింటూ ఉంటారు. తాజాగా, ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న ప్రభాస్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు.


ఆదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. సినిమా డైరెక్టర్ ఓం రౌత్‌కు ఇచ్చిన సర్‌ప్రైజ్‌ను బయటపెట్టారు. ప్రభాస్ మాట్లాడుతూ.. ‘నేను అప్పుడప్పుడు వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ తెప్పిస్తుంటా. బాంబేలో షూటింగ్. ఆదిపురుష్ సినిమా చేస్తున్నాం. ఓం రౌత్ అందరం కూర్చున్నాం. ఆ రోజు చీట్ మీల్. బాంబే కాదు.. నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అని ఓం రౌత్‌తో అన్నాను. ఏం ఫుడ్ తెప్పిస్తావ్ అంటే.. చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్నా. చెన్నై పుడ్ కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఉదయం 10 గంటలు అయినా ఫుడ్ రాలేదు.


ఓం రౌత్ ఏంటిది ఫుడ్ రాలేదు అని అడిగాడు. రావాలి కదా వస్తుంది అన్నాను. ఎక్కడినుంచి అని అడిగాడు. చెన్నై నుంచి అని చెప్పేసరికి షాక్ అయ్యాడు. చెన్నైనుంచి ఫుడ్ ఎలా వస్తుంది అని అడిగాడు. ఒకడు క్యారియర్‌లో ఫుడ్ తెస్తున్నాడు. విమానంలో వస్తున్నాడు అని చెప్పా. కొద్దిసేపటి తర్వాత వేడి వేడిగా చెన్నై నుంచి ఫుడ్ వచ్చింది’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

మేడారం జాతరను యునెస్కో పరిధిలోకి తేవాలి

వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే: భానుప్రకాశ్ రెడ్డి

Updated Date - Feb 21 , 2026 | 11:56 AM