ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ చిత్తు.. టీ20 సిరీస్ టీమిండియాదే
ABN , Publish Date - Feb 21 , 2026 | 05:18 PM
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. దీంతో ఈ సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా దక్కించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. దీంతో ఈ సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా దక్కించుకుంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ల ధాటికి కంగారూ బ్యాటర్లు కంగారు పడ్డారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆసీస్ బ్యాటర్ ఆష్లీ గార్డ్‌నర్(57; 45 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేసింది.
ఇతర బ్యాటర్లు ఎవరూ క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ఫోబ్ లిచ్‌ఫీల్డ్(26), జార్జియా వాల్(10), వారేహం(12), అనెబెల్ సదర్లాండ్(14), గ్రేస్ హ్యారిస్(1), ఎలీస్ పెర్రీ(1), బెత్ మూనీ(6), సోఫీ(6) తీవ్రంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్, శ్రీచరణి చెరో 3, అరుంధతీ రెడ్డి 2, రేణుకా సింగ్ 1 వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మహిళలు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేశారు. స్మృతి మంధాన(82; 55 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్(59; 46 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆసీస్ బౌలర్లలో అనెబెల్ సదర్లాండ్ 2, సోఫీ, కిమ్ గాత్ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో మూడో టీ20: స్మృతి, జెమీమా హాఫ్ సెంచరీలు.. ఆసీస్ టార్గెట్ 177
బీసీసీఐకి ఏదీ అనుకూలంగా లేదు.. గ్రూపింగ్ అంశంపై ఆకాశ్ చోప్రా ఆగ్రహం