Share News

టీ20 ప్రపంచ కప్ 2026: భారీ వర్షం.. న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు

ABN , Publish Date - Feb 21 , 2026 | 09:29 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో తొలి సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. నేడు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికగా న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. మరికాసేపట్లో ఆట ప్రారంభం అవుతుందనగా.. భారీ వర్షం మొదలైంది.

టీ20 ప్రపంచ కప్ 2026: భారీ వర్షం.. న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో తొలి సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. నేడు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికగా న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. టాస్ పడిన సమయంలో వాతావరణం కాస్త మెరుగ్గానే ఉంది. దీంతో టాస్ వేసి ఆటను నిర్వహిద్దామని భావించారు. టాస్ నెగ్గిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో ఆట ప్రారంభం అవుతుందనగా.. భారీ వర్షం మొదలైంది.


సమయం గడిచేకొద్దీ వర్షం పెరుగుతూనే పోయింది. దీంతో ఆటను నిర్వహించే అవకాశాలే లేకుండా పోయాయి. ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో కివీస్-పాక్ జట్లకు చెరొక పాయింట్ లభించింది. సెమీస్‌కు చేరుకోవాలంటే ఇరు జట్లు తమ చివరి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో విజయం సాధించాల్సిన అవసరం ఉంది.


ఇవి కూడా చదవండి:

ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ చిత్తు.. టీ20 సిరీస్ టీమిండియాదే

నా బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు: అభిషేక్ శర్మ

Updated Date - Feb 21 , 2026 | 09:43 PM