అభిషేక్ ఫామ్ అందుకుంటే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు: సూర్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:27 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచ కప్ 2026లో తీవ్రంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లో డకౌట్‌గానే వెనుదిరిగాడు. దీంతో అతడి ఫామ్‌పై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. అభిషేక్ ఫామ్‌పై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచ కప్ 2026లో తీవ్రంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లో డకౌట్‌గానే వెనుదిరిగాడు. దీంతో అతడి ఫామ్‌పై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. అభిషేక్ ఫామ్‌పై స్పందించాడు. సూపర్ 8లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో సూర్య ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.
‘అభిషేక్ ఫామ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. అతడి ఫామ్ గురించి ఆందోళనపడేవారి గురించే నా ఆందోళన. ఇది టీమ్ గేమ్. ఒక్కోసారి ఎలాంటి బ్యాటర్‌కైనా ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది.అభిషేక్ గతేడాది మొత్తం అద్భుతంగా ఆడి మమ్మల్ని కవర్ చేశాడు. ఇప్పుడు మేం అతడికి మద్దతుగా నిలుస్తున్నాం. అభిషేక్ ఒక్కసారి కుదురుకుంటే ఎంతంటి భారీ ఇన్నింగ్స్‌లు ఆడతాడో అందరికీ తెలుసు. తనకున్న ప్రత్యేకమైన గుర్తింపుతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాడు. అతడి ప్రయత్నం ఒక్కసారి సఫలమైతే చాలు ఆపడం చాలా కష్టం.
అభిషేక్ విఫలమైతే మిగతా బ్యాటర్లంతా పరుగులు చేస్తాం. ఇక్కడ నా ఆందోళన అంతా ప్రత్యర్థుల గురించే. ఇప్పటి వరకు అతడు పరుగుల ఖాతా తెరవలేదు. రన్స్ రాబట్టడం మొదలైతే మాత్రం వారికి కష్టాలు తప్పవు. అతడిని ఎలా ఎదుర్కోవాలనేది వారి ఆందోళన. సంజు శాంసన్ రావాలని మీరు కోరుకుంటున్నారా? అభిషేక్ లేదా తిలక్ వర్మ స్థానంలో ఆడాలని భావిస్తున్నారా? ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయాలని అనుకుంటున్నాం. అందుకు సన్నద్ధమవుతున్నాం. తుది జట్టు పైనా కసరత్తు చేస్తాం’ అని సూర్య చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ చిత్తు.. టీ20 సిరీస్ టీమిండియాదే
నా బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు: అభిషేక్ శర్మ