Share News

పేలిన లిక్విడ్ గ్యాస్ ట్రక్.. సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యం

ABN , Publish Date - Feb 21 , 2026 | 01:06 PM

చిలీలోని రెంకా ప్రాంతలో గురువారం లిక్విడ్ గ్యాస్ రవాణా చేస్తున్న ట్రక్ పేలింది. నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పేలిన లిక్విడ్ గ్యాస్ ట్రక్.. సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యం
Santiago truck explosion

ఇంటర్‌నెట్ డెస్క్: లిక్విడ్ గ్యాస్ రవాణా చేస్తున్న ట్రక్ పేలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం చిలీలో చోటుచేసుకుంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం ఓ ట్రక్ హైవేపై లిక్విడ్ గ్యాస్ తీసుకెళుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రెంకా ప్రాంతలో డ్రైవర్ వాహనంపై కంట్రోల్ కోల్పోయాడు. ట్రక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆ వెంటనే భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత 150 నుంచి 200 మీటర్ల వరకు పడింది. దాదాపు 50 వాహనాలు ప్రమాదంలో కాలిపోయాయి.


డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు మంటల్లో కాలి చనిపోయారు. 17 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. పోలీసులు గాయపడ్డవారిని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆ ట్రక్ స్థానిక గ్యాస్ కంపెనీ గాస్కోకు చెందినదిగా తేలింది. ఈ ప్రమాదంపై ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ గాస్కోను సంప్రదించింది. ప్రమాదంపై పలు ప్రశ్నలు వేసింది. సదరు కంపెనీ రాయిటర్స్ ప్రశ్నలపై స్పందించలేదు.


ఇక, పేలుడుకు సంబంధించి సీసీటీవీ దృశ్యం తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో బాంబ్ బ్లాస్ట్ సీన్‌ను తలపించేలా ఆ వీడియోలోని దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. మొదట లిక్విడ్ గ్యాస్ ఆ ప్రాంతం మొత్తం వ్యాపించింది. ఆ వెంటనే మంటలు మొదలయ్యాయి. 40 అడుగుల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడ్డాయి. మంటల కారణంగా 200 మీటర్ల మేర హైవే మొత్తం నాశనం అయింది.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్ చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్..

స్కూల్లో కాల్పులు! చాట్‌జీపీటీతో హంతకురాలి అనుమానాస్పద చాటింగ్

Updated Date - Feb 21 , 2026 | 02:05 PM