Share News

రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

ABN , Publish Date - Feb 21 , 2026 | 07:03 PM

ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది..

రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
AP Rain Alert

అమరావతి: రాష్ట్రంలో కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చలి తీవ్రత తగ్గుతూ, ఎండలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


తూర్పుగోదావరి జిల్లాలో ఆది, సోమవారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే.. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


ఇవి కూడా చదవండి..

దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తారా.. వైసీపీపై మంత్రి ఫైర్..

వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోను: సీఎం చంద్రబాబు

Read Latest AP News

Updated Date - Feb 21 , 2026 | 07:09 PM