Share News

జకాత్‌ పేరుతో సైబర్‌ వల

ABN , Publish Date - Feb 21 , 2026 | 08:34 AM

సైబర్‌ నేరగాళ్లు పండుగలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రంజాన్‌ మాసం ప్రారంభమైన తరుణంలో సామాజిక మాధ్యమాల్లో డొనేషన్‌, రంజాన్‌ ఆఫర్ల సందేశాల పేరుతో వల విసురుతున్నారు.

జకాత్‌ పేరుతో సైబర్‌ వల

  • రంజాన్‌ వేళ నకిలీ లింక్‌లతో టోకరా..

  • అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ: సైబర్‌ నేరగాళ్లు పండుగలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రంజాన్‌ మాసం ప్రారంభమైన తరుణంలో సామాజిక మాధ్యమాల్లో డొనేషన్‌, రంజాన్‌ ఆఫర్ల సందేశాల పేరుతో వల విసురుతున్నారు. పేదలకు, అనాథలకు సహాయం, మసీదు నిర్మాణానికి, గాజాలో బాధితులకు సహకారం, జకాత్‌ పేరుతో నకిలీ లింక్‌లు, క్యూఆర్‌ కోడ్‌లు పంపుతున్నారు. అపరిచితులు పంపే అటువంటి లింక్‌లను తెరవకూడదని సైబర్‌ క్రైం అధికారులు హెచ్చరిస్తున్నారు.


ఏపీకే లింక్‌లను తెరిస్తే అందులో ఉన్న మాల్‌వేర్‌ సాయంతో మొబైల్‌ను తమ నియంత్రణలో తీసుకొని ఖాతాల్లో డబ్బు కాజేస్తారని వివరించారు. అంతేకాకుండా మొబైల్‌లో ఉన్న ఫొటోలు, సమాచారం, ఫోన్‌ నంబర్లను దుర్వినియోగం చేస్తారని హెచ్చరించారు. తక్కువ ధరకే దుస్తులు, పండ్లు, ఖర్జూరాలు, గృహోపకరణాలు వంటి సందేశాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. నమ్మకమైన సంస్థలు, వ్యక్తులకు మాత్రమే జకాత్‌ విరాళాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.


city4.2.jpgవాట్సప్‌, టెలిగ్రాం, ఇన్‌స్టాగ్రామ్‌లలో వచ్చిన సందేశాలను పరిశీలించకుండా ఇతరుకు ఫార్వార్డ్‌ చేయకూడదని, మీరు పంపిన సందేశాలకు సంబంధించి మీద నవ్మకంతో మీ పరిచయస్తులు, బంధువులు లింక్‌లు తెరిచి సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశముందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్త నెంబర్ల నుంచి వచ్చిన క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి డబ్బు పంపవద్దని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మెడికల్‌ పీజీ కోర్సులకు లైన్‌ క్లియర్‌

చరిత్రను తిరగరాసిన సరిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2026 | 08:34 AM