రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:28 PM
పెద్దపల్లి నియోజవకవర్గంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు యాప్‌లో నమోదు చేసుకుని ఎరువులు పొందాలని ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. కనుకులలో తెలంగాణ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని హాక కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి నియోజవకవర్గంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు యాప్‌లో నమోదు చేసుకుని ఎరువులు పొందాలని ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. కనుకులలో తెలంగాణ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని హాక కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. యాప్‌లో పేరు, సాగు వివరాలను నమోదు చేసుకున్న రైతులకు ఎరువులను ఆలాట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతు రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఎరువులను పంపిణీ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, కొన్ని అనివార్య పరిస్థితుల వలన కొంత కొరత వచ్చిన మాట వాస్తవేమనన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలలో ఎక్కడా కొరత లేద, రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు తమ అవసరానికి మించి ఎరువులను కొనడం, బ్లాక్ చేయడం వలన అసలు రైతులకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించిందన్నారు. ఎరువుల కోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సాగు విస్తీర్ణం మేరకు ఎరువులను పొందవచ్చన్నారు. ప్రస్తుతం ఎకరాకు రెండు నుంచి రెండున్నర బస్తాల అలాట్ మెంట్ ఉందని, ఎకరాకు మూడు బస్తాల చొప్పన ఇప్పించాలని పలువురు రైతులు ఎమ్మెల్యేను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. వ్యవసాయ అధికారి పైడితల్లి, మార్కెట్ కమిటీ డైరక్టర్ ఇల్లెందుల శ్రీనివాస్‌గౌడ్, పుష్పలత, సర్పంచ్‌లు కర్రె కవిత కుమార్, సుబ్బని రాయమల్లు, మాజీ సర్పంచ్ అంజయ్య, మీస సత్తన్న చిలుక సతీష్ పాల్గొన్నారు.