kumaram bheem asifabad- క్రీడల్లో రాణించడం అభినందనీయం
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:10 PM
క్రీడల్లో రాణించడం అభినందనీయమని కలెక్టర్ కె హరిత అన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 17న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో రాణించిన జిల్లా విద్యార్థులను శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆటల పోటీల్లో పాల్గొని జిల్లా జట్టు రెండో స్థానం సాధించినందున విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్, షీల్డ్‌లు అందజేశారు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): క్రీడల్లో రాణించడం అభినందనీయమని కలెక్టర్ కె హరిత అన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 17న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో రాణించిన జిల్లా విద్యార్థులను శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆటల పోటీల్లో పాల్గొని జిల్లా జట్టు రెండో స్థానం సాధించినందున విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్, షీల్డ్‌లు అందజేశారు. ఈ సందర్భంగ్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఇండోర్, అవుట్‌డోర్ ఆటల పోటీలలో పాల్గొని జిల్లాకు ద్వితీయ స్థానం సాధించి మంచి పేరు తీసుకొచ్చారని అన్నారు. ఈ సాధనలో తమ వంతు పాత్ర పోషించిన ప్రతి ఒక్కరు అభినందనీయులని మున్ముందు జిల్లాకు పేరును ముందు వరుసలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల స్పోర్ట్స్ ఇన్‌చార్జి శాంతికుమారి, ఐఈఆర్‌పీలు సతీష్, సుజాత, రమణ, ప్రత్యేక విద్యావేత్త మహేష్, తదితరులు పాల్గొన్నారు.
కంప్యూటర్లు అందించడం ప్రశంసనీయం..
సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లను అందించేందుకు సింగరేణి సంస్థ ముందుకు రావడం ప్రశంంసనీయమని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శుక్రవారంకార్పొరేట్ కంపెనీల బాధ్యతలో భాగంగా సింగరేణి సంస్థ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో ఎక్కువ విద్యార్థులు కలిగిన నాలుగు పాఠశాలలకు కంప్యూటర్లు జీఎం విజయభాస్కర్‌రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి సంస్థ 11 కంప్యూటర్లు, 11 సీపీయూలు, 5 ప్రింటర్లు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్‌లో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ప్రధానోపాధ్యా యులు, పాఠశాలల ప్రణాళిక సమన్వయకర్త అబిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.