kumaram bheem asifabad-అంగన్‌వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులు
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:13 PM
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు (3-6 ఏళ్ల లోపు) ఏక రూప దుస్తులు ప్రభుత్వాలు అందించనున్నాయి. గత ఏడాది అక్టోబరులో మహిళా శిశు సంక్షేమ శాఖ కమి షనరేట్ నుంచి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమాధి కారుల కార్యాలయాలకు దుస్తులకు సంబంధించిన వస్త్రం పంపిణీ చేశారు. మండలాల్లోని ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో టైలరింగ్ ద్వారా ఉపాధి పొందే మహిళా సంఘాల సభ్యులకు కుట్టు పనులు అప్పగించారు.
- మహిళా సంఘాలకు తయారీ బాధ్యతలు
బెజ్జూరు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు (3-6 ఏళ్ల లోపు) ఏక రూప దుస్తులు ప్రభుత్వాలు అందించనున్నాయి. గత ఏడాది అక్టోబరులో మహిళా శిశు సంక్షేమ శాఖ కమి షనరేట్ నుంచి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమాధి కారుల కార్యాలయాలకు దుస్తులకు సంబంధించిన వస్త్రం పంపిణీ చేశారు. మండలాల్లోని ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో టైలరింగ్ ద్వారా ఉపాధి పొందే మహిళా సంఘాల సభ్యులకు కుట్టు పనులు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని మండలాల్లో ఏక రూప దుస్తుల తయారీ పూర్తయింది. మరికొన్ని చోట్ల తయారీ చివరి దశలో ఉంది. 2025-26 ఆర్థిక సంవ త్సరంలోనే చిన్నారులకు ఏకరూప దుస్తులు అందించ నున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,006 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. చిన్నారులు 24,765 మంది నమోదయ్యారు. బాలురకు ఏకరూప దుస్తు లు రెండు జతలు పంపిణీ చేస్తారు. ఎరుపు బూడిద రంగు చొక్కాలు(2), నీలం(బ్లూ) రంగు నెక్కర్లు (2) అందజేస్తారు. బాలికలకు ఎరుపు, బూడిద రంగు గౌన్లు(2) అందజేస్తారు. జిల్లాలో ఇప్పటికే పలు మం డలాల్లోని మహిళా సంఘాల ద్వారా ఏకరూప దుస్తు లు కుట్టే పనులు పూర్తి చేశారు. వాటిని ఐసీడీఎస్ అధికారులకు అందజేశారు. పలు మండలాల్లో ఏకరూప దుస్తుల తయారీ పూర్తయ్యాయి. మిగితా మండలాల్లో ఏకరూప దుస్తుల తయారీ చివరి అంకానికి చేరింది.
- ఐదు ప్రాజెక్టులు..
జిల్లాలో ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఆసి ఫాబాద్, జైనూరు, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), వాంకిడి లు ఉన్నాయి. ఆసిఫాబాద్ ప్రాజెక్టు పరిధిలో 5,247 మంది చిన్నారులు ఉన్నారు. ఇందులో బాలురు 2,733, బాలికలు 2,514 మంది ఉన్నారు. జైనూరు పరిధిలో మొత్తం 3,970 మంది ఉన్నారు. ఇందులో బాలురు 1,936, బాలికలు 2,034 మంది ఉన్నారు. కాగజ్‌నగర్ పరిధిలో 5,098 మంది ఉన్నారు. ఇందులో బాలురు 2,547, బాలికలు 2.551 మంది ఉన్నారు. సిర్పూర్(టి) పరిధిలో మొత్తం 5,451 మంది ఉన్నారు. ఇందులో బాలురు 2,737, బాలికలు 2714 మంది ఉన్నారు. వాంకిడి పరిధిలో 4,999 మంది ఉన్నారు. ఇందులో బాలురు 2,357, బాలికలు 2,642 మంది ఉన్నారు. కాగా ఇప్పటి వరకు ఐదు ప్రాజెక్టుల పరిధిలో మొదటి దఫాగా 6,355 మందికి యూనిఫాంలు పంపిణీ చేశారు. మరో 18,410 మందికి పంపిణీ చేయాల్సి ఉంది.
పనులు పూర్తయ్యాయి.
- ఆడెపు భాస్కర్, జిల్లా సంక్షేమాధికారి
ఇప్పటికే పలు మండలాల్లో ఏకరూప దుస్తులు కుట్టే పనులు పూర్తయ్యాయి. మిగిలిన మండలాల్లో పనులు తుది దశకు చేరాయి. మహిళా, శిశు సంక్షే మ శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల ప్రకారంగా త్వర లో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేయనున్నాం.