Share News

బీజేపీ చేతికి కరీంనగర్ కార్పొరేషన్..?

ABN , Publish Date - Feb 14 , 2026 | 07:41 PM

కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ చేతికి వెళ్తుందా లేదా కాంగ్రెస్‌కా? అనే విషయానికి దాదాపు తెరపడింది. కార్పొరేషన్‌లో గెలిచిన ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బీజీపీ గూటికి చేరారు.

బీజేపీ చేతికి కరీంనగర్ కార్పొరేషన్..?
Karimnagar Municipal Corporation

కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ చేతికి వెళ్తుందా లేదా కాంగ్రెస్‌కా? అనే విషయానికి దాదాపు తెరపడింది. కార్పొరేషన్‌లో గెలిచిన ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బీజీపీ గూటికి చేరారు. కేంద్రమంత్రి బండి సంజయ్ వారికి కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇది వరకే మరో ఇద్దరు కార్పొరేటర్లు బీజేపీలో చేరగా.. తాజాగా మరో ఇద్దరు కమలం పార్టీకే జై కొట్టారు. దీంతో కార్పొరేషన్‌లో బీజేపీ బలం 34కు చేరింది. మెుత్తం 66 డివిజన్లలో ఎన్నికలు జరగ్గా.. బీజేపీ 30 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. తాజాగా మరో నలుగురు చేరడంతో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో దాదాపు బీజేపీకే కరీంనగర్ కార్పొరేషన్ వెళ్లనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆస్పత్రి నుంచి మహిళ అదృశ్యం.. వారం రోజులు గడిచినప్పటికీ

దారుణం.. బావను చంపేసిన బామ్మర్దులు..

Updated Date - Feb 14 , 2026 | 08:00 PM