బీఆర్‌ఎస్ తటస్థం.. బీజేపీదే కరీంనగర్ మేయర్ పీఠం
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:24 PM
కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. 34 ఓట్లతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
కరీంనగర్, ఫిబ్రవరి 16: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీ (BJP) కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ మేయర్‌గా, సునీల్‌రావు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్ ఎటువైపు మొగ్గుచూపకుండా తటస్థంగా ఉండటంతో, బీజేపీ అభ్యర్థి 34 ఓట్లతో విజయం సాధించారు. దీంతో మొదటి సారి కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది.
కాగా.. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా.. బీజేపీ 30 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 14 స్థానాలు, బీఆర్‌ఎస్ 9 స్థానాలు, స్వతంత్రులు 8 స్థానాలు, ఎంఐఎం 3 సీట్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాలతో హంగ్ నెలకొన్నప్పటికీ.. స్వంతంత్రులు, ఇతరుల అభ్యర్థులతో బీజేపీ మేయర్ పదవిని దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి...
బుల్లెట్ రైళ్ల హబ్‌గా శంషాబాద్!
తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తం..
Read Latest Telangana News And Telugu News