తెలంగాణలో మున్సిపల్ పీఠాల కుర్చీలాట.. వింతలు, విడ్డూరాలు, ఉద్రిక్తతలు!
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:46 PM
తెలంగాణ మున్సిపల్ పీఠాలకు ఇవాళ కుర్చీలాట జరుగుతోంది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలు ఇవాళ జరిగాయి. ఇక, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునే ప్రక్రియలో మాత్రం అనేక రకాల టర్న్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏయే పరిణామాలు, ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయో చూద్దాం..
ఆదిలాబాద్: ఖానాపూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల వద్ద హై టెన్షన్
ఆదిలాబాద్: ఖానాపూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల వద్ద హై టెన్షన్
ఇప్పటికీ చేరుకోని మెజారిటీ కౌన్సిలర్లు
కోరం లేక వాయిదా పడే అవకాశం
హంగ్ నేపథ్యంలో వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్న పార్టీలు
మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత
బీఆర్ఎస్-సీపీఐ కౌన్సిలర్ల వాహనాలను లోనికి అనుమతించని పోలీసులు
నిరసనగా బయటకు వచ్చేసిన కౌన్సిలర్లు
ఎన్నిక రేపటికి వాయిదా
మద్దూర్ మున్సిపల్ చైర్మన్ పదవి రగడ
నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని ముదిరాజ్‌లకు కేటాయించాలని మద్దూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి ఇంటి ముందు గడ్డమిది గోవిందు వర్గీయులు ధర్నాకు దిగారు.