Home » MIM
కేంద్ర ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను క్రమంగా కోల్పోతోందని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఒకప్పుడు ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని పొందిన ఈ వ్యవస్థ, ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతోందని పేర్కొన్నారు.
బ్రిక్స్ నాయకులకు ఇచ్చిన గాలా డిన్నర్‌లో శాకాహార వంటకాలు మాత్రమే వడ్డించడంపై రేగిన రాజకీయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మన దేశంలో దాదాపు 20 శాతానికి పైగా మైనారిటీలు కూడా శాకాహారాన్నే భుజిస్తున్నారని ఆయన అన్నారు.
నాయకుల కళ్లుగప్పి పరారైనట్లు ప్రచారం జరుగుతున్న మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్.. ఆ పార్టీ అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.
రహ్మత్ బేగ్ వ్యవహారం మజ్లిస్ పార్టీకి తలనొప్పిలా మారింది. ఓ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రహ్మత్ బేగ్‌ను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని మజ్లిస్ అధిష్ఠానం ఆదేశించింది. కానీ, మూడు రోజులైనా ఆయన రాజీనామా చేయలేదు.
ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ను ఆ పార్టీ హై కమాండ్ బహిష్కరించింది. తక్షణమే పార్టీని వదలి వెళ్లాలని ఎంఐఎం అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ హై కమాండ్ ప్రకటించింది.
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. పలుమార్లు ఫోన్ చేసిన దుండగులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్‌కి అనుమతి ఇస్తే ఏమవుతుంది? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పడూ మాట్లాడలేదని అన్నారు..
కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తన కొండగట్టు పాదయాత్ర రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ మున్సిపల్ పీఠాలకు ఇవాళ కుర్చీలాట జరుగుతోంది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలు ఇవాళ జరిగాయి. ఇక, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునే ప్రక్రియలో మాత్రం అనేక రకాల టర్న్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏయే పరిణామాలు, ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయో చూద్దాం..