Congress Leader Ayesha Farheen Resigns: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:03 PM
నాంపల్లి రెడ్డి హిల్స్ డివిజన్ కాంగ్రెస్ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసిన ఆయేషా ఫర్హీన్ ఈరోజు(ఆదివారం) రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించారు.
హైదరాబాద్, ఆగస్టు31, (ఆంధ్రజ్యోతి): నాంపల్లి రెడ్డి హిల్స్ డివిజన్ కాంగ్రెస్ (Congress) తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసిన ఆయేషా ఫర్హీన్ (Ayesha Farheen) ఈరోజు(ఆదివారం) రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను కాంగ్రెస్ హై కమాండ్‌కు పంపించారు. దీంతో నాంపల్లి నియోజకవర్గంలో కీలక నేతను కాంగ్రెస్ పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. ఆయేషా ఫర్హీన్ మజ్లిస్ పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఆయేషా ఫర్హీన్ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అధికారికంగా ఆమె ఎంఐఎంలో చేరారు. ఈ క్రమంలో అసదుద్దీన్ ఓవైసీ ఆయేషా ఫర్హీన్‌ను ఆహ్వానిస్తూ పార్టీ సిద్ధాంతాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయేషా ఫర్హీన్ మాట్లాడుతూ.. “నాకు ప్రజల కోసం పని చేయాలన్న తపన ఉంది. కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ ఆశించిన విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలు దొరకలేదు. ఎంఐఎం పార్టీ మాత్రమే నిజంగా మైనార్టీలు, బలహీన వర్గాలు, పేదల కోసం నిరంతరం కృషి చేస్తోందని నమ్మకం కలిగింది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ఆయేషా ఫర్హీన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది.. మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరంపై సెటిల్‌మెంట్... రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
For More TG News And Telugu News