Share News

Rakesh Reddy VS KCR: కాళేశ్వరంపై సెటిల్‌మెంట్... రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:01 PM

కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక మీద అసెంబ్లీలో చర్చ పెట్టి ఇంత అత్యవసరంగా సీఎం రేవంత్‌రెడ్డి కేరళ ఎందుకు వెళ్లారని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. భవిష్యత్ తరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ ఓ గుణపాఠం కావాలని రాకేశ్ రెడ్డి హెచ్చరించారు.

Rakesh Reddy VS KCR: కాళేశ్వరంపై సెటిల్‌మెంట్... రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rakesh Reddy VS KCR

హైదరాబాద్, ఆగస్టు31, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై (KCR) బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (BJP Armor MLA Paidi Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి కేరళ పర్యటన మతలబు ఏంటి..? అని ప్రశ్నించారు. బుక్ రిలీజ్ కోసం రేవంత్‌రెడ్డి కేరళ వెళ్లారంటే నమ్మేలా లేదని నిలదీశారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికపై కీలక చర్చ జరుగుతున్నపుడు ఈ కేరళ టూర్ ఏంటని..? ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరం చర్చ కేరళలో ఎందుకు..? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డితో, కేసీఆర్ తన మనిషిని కేరళకు పంపించారనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. ఇద్దరు కలిసి కేరళకు వెళ్లారా..? అక్కడే కాళేశ్వరంపై సెటిల్‌మెంట్ జరుగుతుందా..? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి.


కాళేశ్వరం స్కామ్ గుణపాఠం కావాలి..

ఇవాళ(ఆదివారం) అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పైడి రాకేశ్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చనున్న కాళేశ్వరంపై అసెంబ్లీలో ఇవాళ కీలక చర్చ జరుగుతోందని తెలిపారు. భవిష్యత్ తరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ గుణపాఠం కావాలని హెచ్చరించారు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధుల కోసం అండమాన్‌ జైల్ కట్టారని.. ఇప్పటికీ దాని గుర్తులు, ఆనవాళ్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో అవినీతి, అక్రమాలు చేసిన వారికోసం ప్రత్యేక జైలు కట్టించి అందులో ఉంచాలని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి.


వారి గుండెల్లో భయం పుట్టాలి..

అప్పుడే రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు తెలంగాణ ప్రజలు భావిస్తారని పేర్కొన్నారు. ఆ ప్రత్యేక జైల్ చూసినప్పుడల్లా అవినీతి రాజకీయ నాయకుల గుండెల్లో భయం పుట్టాలని హెచ్చరించారు. కాళేశ్వరం మీద చర్చ పెట్టి ఇంత అత్యవసరంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు కేరళ వెళ్లినట్లని ప్రశ్నల వర్షం కురిపించారు. బహుశా కేసీఆర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణు గోపాల్.. రేవంత్ రెడ్డిని కేరళ పిలిచినట్లు ఉన్నారని విమర్శించారు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి.


రాజాసింగ్‌కు కష్టాలు..

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాముడు లాంటి వారని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కొనియాడారు. అందుకే రాజాసింగ్‌కు ఈ కష్టాలు తప్పడం లేదని చెప్పుకొచ్చారు. రాముడంతటి వారికి వనవాసం తప్పలేదని.. రేపు తమకు ఈ పరిస్థితి ఎదురు కావచ్చని.. అయినా తాము ధర్మం కోసం కొట్లాడుతాం, నిలబడతామని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది.. మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

For More TG News And Telugu News

Updated Date - Aug 31 , 2025 | 04:25 PM