Share News

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కసరత్తు షురూ..

ABN , Publish Date - Aug 21 , 2025 | 07:47 AM

జూబ్లీహిల్స్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ పరిధిలో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌కు షెడ్యూల్‌ విడుదల చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు.

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కసరత్తు షురూ..

- సమ్మరీ రివిజన్‌ షెడ్యూల్‌ విడుదల

- 28వ తేదీ వరకు పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ

- సెప్టెంబరు 2 నుంచి 17 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ

- 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదుకు అవకాశం

- పార్టీల ప్రతినిధులతో కర్ణన్‌ సమావేశం

హైదరాబాద్‌ సిటీ: జూబ్లీహిల్స్‌(Jubilee Hills) శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ పరిధిలో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌కు షెడ్యూల్‌ విడుదల చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. బుధవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబరు 2వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సమ్మరీ రివిజన్‌ జరగనుంది.


ఈ నెల 28వ తేదీలోపు పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేయనున్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలో జూలై 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్‌గా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. సమ్మరీ రివిజన్‌ ప్రక్రియకు సహకరించాలని పార్టీల ప్రతినిధులను ఆయన కోరారు. 2025 జనవరి 6 నుంచి ఆగస్టు 19 వరకు 19215 ఓటర్‌ నమోదు/తొలగింపునకు దరఖాస్తులు రాగా 14810 ఆమోదిం చామని, 3554 తిరస్కరించామని, 851 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉంచినట్టు చెప్పారు.


పోలింగ్‌ కేంద్రాలు పెంచాలి

సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1400, 1500 మంది ఓటర్లు ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నట్టు తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం కొన్నిచోట్ల 1500 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం కల్పించిందని కర్ణన్‌ వారికి స్పష్టతనిచ్చారు.


city3.2.jpg

ఆగస్టు 20, 2025 నాటికి ఓటర్ల లెక్క ఇది

- పురుషులు- 2,04,165

- మహిళలు- 1,88,213

- ఇతరులు- 25

- మొత్తం- 3,92,403

- పోలింగ్‌ కేంద్రాలు- 329

- పోలింగ్‌ ప్రాంతాలు- 132


ఈ వార్తలు కూడా చదవండి..

అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక

Read Latest Telangana News and National News

Updated Date - Aug 21 , 2025 | 07:47 AM