Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌లో దసరా దమ్కీ..
ABN , Publish Date - Oct 02 , 2025 | 10:38 AM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు దసరా పండగ ఖర్చు భారీగానే అవుతోంది. మద్యం, మామూళ్లు ఇవ్వాలంటూ చోట, మోటా నేతలు ఆశావహుల ఇళ్ల వద్ద క్యూ కట్టారు. కొందరూ ఆశావహులు రెండు రోజులుగా పంపకాలను ప్రారంభించారు.
- మద్యం.. లేకుంటే మామూళ్లు ఇవ్వాల్సిందే
- ఆశావహుల ఇళ్లకు చోటా, మోటా నేతల క్యూ
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-election)లో కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు దసరా పండగ ఖర్చు భారీగానే అవుతోంది. మద్యం, మామూళ్లు ఇవ్వాలంటూ చోట, మోటా నేతలు ఆశావహుల ఇళ్ల వద్ద క్యూ కట్టారు. కొందరూ ఆశావహులు రెండు రోజులుగా పంపకాలను ప్రారంభించారు. మద్యం, మామూళ్లు ఇచ్చి పంపుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఓ నేత.. పండుగ రోజే ఇంటికి రావాలని.. మాంసం, మందుతో విందు ఉంటుందని ఫోన్ చేసి చెబుతున్నట్లు సమాచారం.
దసరా మామూళ్లు ఇవ్వాలంటూ కాలనీలు, బస్తీలకు చెందిన నేతలు బారులు తీరారు. కొందరైతే ఏకంగా ఫోన్లు చేసి మరీ మన వెంట తిరిగేవారికి మందు పంచుదామని టికెట్ ఆశిస్తున్న ఆశావహుడి ముందు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. కొందరూ యూట్యూబర్స్ కూడా టికెట్ ఆశించే వారి ఇళ్ల ముందు బారులు తీరుతున్నారు. వారం రోజులుగా తన ఇంటికి వచ్చే యూట్యూబర్స్ పేర్లను తన అనుచరుడి వద్ద నమోదు చేసుకోవాలని ఓ ఆశావహుడు సూచించగా.. 200కు పైగా పేర్లు నమోదైనట్లు తెలిసింది.
కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్, గుర్రం మురళీగౌడ్, సీఎన్‌రెడ్డి, కంజర్ల విజయలక్ష్మీ ఫ్లెక్సీలు, బ్యానర్లు పెద్దఎత్తున కడుతున్నారు. కొందరు ఆశావహులు వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహించి మహిళలకు బహుమతులు అందజేశారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్న ఓ నేత ఖర్చు ఇప్పటికే కోటి రూపాయలకు పైగా చేరినట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు ఇప్పటి వరకు ఆరుగురు కాగా.. తాజాగా మైనంపల్లి టీమ్ పేరుతో ఫ్లెక్సీలు రావడంతో ఏడుగురికి చేరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..
Read Latest Telangana News and National News