Share News

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఏర్పాట్లు..

ABN , Publish Date - Sep 19 , 2025 | 07:36 AM

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం జీహెచ్‌ఎంసీ యూసుఫ్‏గూడ సర్కిల్‌-19 కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు సర్ఫరాజ్‌ అహ్మద్‌ సందర్శించారు. ఈఆర్‌ఓ, సర్కిల్‌-19 డీఎంసీ రజనీకాంత్‌ రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఏర్పాట్లు..

- అధికారులతో ఎన్నికల పరిశీలకుడు సర్ఫరాజ్‌ అహ్మద్‌ సమావేశం

- కొత్తగా ఓటరు నమోదుకు 6,563 దరఖాస్తులు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం(Jubilee Hills Assembly Constituency) ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం జీహెచ్‌ఎంసీ యూసుఫ్‏గూడ సర్కిల్‌-19 కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు సర్ఫరాజ్‌ అహ్మద్‌(Sarfaraz Ahmed) సందర్శించారు. ఈఆర్‌ఓ, సర్కిల్‌-19 డీఎంసీ రజనీకాంత్‌ రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు, తదితర అంశాలపై వారితో చర్చించారు.


city3.2.jpg

కొత్తగా ఓటరు నమోదుకు 6,563, తొలగింపు కోసం 361, సవరణల కోసం 2,298 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ నెల 30న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం(Jubilee Hills Constituency) తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.


city3.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి

శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 19 , 2025 | 07:36 AM