GHMC Council Meeting: GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం.. బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన..
ABN , Publish Date - Dec 16 , 2025 | 06:06 PM
సాధారణంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో తరుచూ వాడీ వేడీ చర్చలు జరుగుతుంటాయి. సభ్యుల మధ్య వాగ్వాదాలు తారాస్థాయికి చేరి ఆందోళన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్ అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ రోజు (మంగళవారం) జీహెచ్ఎంసీ (GHMC) ప్రత్యేక కౌన్సిల్ సమావేశం (Special Council Meeting) జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా వార్డుల పునర్విభజన (Ward Delimitation) అంశంపై జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా విలీనం చేసిన 27 మునిసిపాలిటీల(Municipalities)తో పాటు, వార్డుల సంఖ్యను 150 నుంచి 300 వరకు పెంచేందుకు ప్రభుత్వం చేసిన డివిజన్ల డీలిమిటేషన్ పై బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పోరేటర్లు, నగరవాసులు తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నారు. చర్చలు జరుగుతున్న క్రమంలోనే సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. దారుస్సలంలో వార్డుల విభజన చేశారంటూ బీజేపీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం కార్పోరేటర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎంఐఎం(MIM BJP Corporators), బీజేపీ కార్పోరేటర్ల (BJP Corporators)మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
గెజిటెడ్ పేపర్లను చింపి కౌన్సిల్లో విసురుతూ, మేయర్ (Mayor) పోడియం వద్దకు దూసుకెళ్లారు బీజేపీ కార్పోరేటర్లు. దీంతో బీజేపీ కార్పొరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi). గందరగోళం నడుమ పునర్విజనపై కార్పోరేటర్లు నుంచి వచ్చిన అభిప్రాయాలను, అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని మేయర్ ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ కార్పోరేటర్లు కౌన్సిల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. రేవంత్ సర్కార్ ఏంఐఎంకు అనుకూలంగా విభజన చేశారని.. జీహెచ్ఎంసీ రిలీజ్ చేసిన మ్యాప్ తప్పుల తడకగా ఉందంటూ ఆందోళన చేశారు. దీంతో అక్కడికి భారీగా పోలీసులు మోహరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ కోటి సంతకాల సేకరణ నాటకం.. బూటకం
తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్