బాల్క సుమన్ రెచ్చగొట్టి డ్రామాలు చేస్తున్నారు.. మంత్రి వివేక్ ఫైర్
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:44 PM
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీరుపై తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ తమపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు.
మంచిర్యాల జిల్లా, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీరుపై తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి (Telangana Minister Gaddam Vivek Venkatswamy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ తమపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. ఇది ఏం పద్ధతని.. ఈ విషయంలో బాల్క సుమన్‌ని హరీశ్‌రావు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. ఇవాళ(బుధవారం) క్యాతనపల్లిలో మీడియాతో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. క్యాతనపల్లెలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. సుమన్ దౌర్జన్యం అందరూ చూశారన్నారు. సుమన్ ఆరోపణలన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. ఆయన రెచ్చగొట్టి డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహించారు.
బాల్కసుమన్ మా మీద రాళ్లు విసిరారు..
మొదటిరోజు కోరం లేకపోవడంతో క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికని వాయిదా వేశామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రెండోరోజు బయటి వాళ్లు వచ్చి గొడవ చేశారని చెప్పుకొచ్చారు. అనవసర గొడవ కారణంగా రెండోరోజు వాయిదా పడిందని అన్నారు. ఎన్నిక ప్రాసెస్‌ను తాము అడ్డుకోలేదని స్పష్టం చేశారు. బాల్కసుమన్ తమ మీద రాళ్లు విసిరారని, దాడి చేశారని ఆరోపణలు చేశారు. రెండురోజులుగా సుమన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో చెన్నూరు, క్యాతనపల్లెలో సరిగా ఎన్నికలు జరగలేదని, గుండాయిజంతో మున్సిపల్ ఎన్నికలు ఏకగ్రీవం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు.
అధికార దుర్వినియోగం చేయలేదు..
బీఆర్ఎస్ నేతలు క్యాంపు పెట్టుకుంటే ఎక్కడైనా తాము గొడవ చేశామా అని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. తాము ఎలాంటి అధికార దుర్వినియోగం చేయలేదని తేల్చిచెప్పారు. మంత్రి, ఎంపీ కార్లపై రాళ్లు విసరడం సరైనదైనా అని నిలదీశారు. తమపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయినా బాధలో బాల్కసుమన్ తమపై ఫ్రస్టేషన్ చూపుతున్నారని ఫైర్ అయ్యారు. హరీశ్‌రావుకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే సుమన్ తమపై చేసిన దాడిని ఖండించాలని అన్నారు. తాము చెన్నూరులో ఏరోజు బీఆర్ఎస్‌పై దాడి చేయలేదని... ఎవరినీ అరెస్ట్ చేయలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
కాంగ్రెస్ దాడులకు దిగింది: ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు
Read Latest Telangana News And AP News And Telugu News