Rajendranagar Fire Accident: రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:31 AM
రాజేంద్రనగర్‌లోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున ప్లాస్టిక్ నిల్వలు ఉండడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది..
హైదరాబాద్, జనవరి 13: రాజేంద్రనగర్ మండలంలోని బుద్వేల్ ప్రాంతంలో ఉన్న ఒక ప్లాస్టిక్ రీసైకిల్ యూనిట్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడడంతో పాటూ దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలంలోనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు.. పోలీసులు సమాచారం అందించడంతో వెంటనే రంగంలోకి దిగారు.
మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. అయితే పరిశ్రమలో ప్లాస్టిక్ నిల్వలు భారీగా ఉన్నాయని.. అవి మొత్తం అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లా లేదా ఇతర సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా.. అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఊపిరిపీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదంలో ఎంత మేరకు ఆస్తినష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..
Read Latest Telangana News And Telugu News