Share News

Kite and Sweet Festival: గ్రాండ్‌గా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. హాజరైన పలువురు మంత్రులు

ABN , Publish Date - Jan 13 , 2026 | 08:19 PM

భాగ్యనగరంలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Kite and Sweet Festival: గ్రాండ్‌గా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. హాజరైన పలువురు మంత్రులు

హైదరాబాద్, జనవరి 13: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌లో నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్‌ను(International Kite and Sweet Festival) మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో జూపల్లితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మూడు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ గ్రాండ్ ఈవెంట్‌కు దాదాపు 19 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్(Kite Flyers) పాల్గొంటున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌కు సందర్శకులు పెద్దఎత్తున తరలి వస్తుండటంతో సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్స్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది(Parade Grounds Kite Festival).


ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) మాట్లాడుతూ.. 'పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నాం. వివిధ రాష్ట్రాల మహిళలు ఇక్కడి స్వీట్ ఫెస్టివల్‌లో భాగమయ్యారు. దేశ విదేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ వచ్చారు. మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఇది సంస్కృతి సంప్రదాయాలను చాటిచెప్పే కార్యక్రమం. డ్రోన్స్‌తో ఆకాశంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఉంటుంది. హాట్‌ఎయిర్ బెలూన్స్ ఏర్పాటు చేశాం. ఇది ఈ నెల 16 నుంచి 18 వరకు జరగనుంది. 2027 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వారానికి ఒక రోజు అయినా మనం హాలిడేగా గడపాలి' అని చెప్పారు. టూరిజంలో అనేక ప్రాంతాలను విజిట్ చేయాలని మంత్రి జూపల్లి అన్నారు. ఫలితంగా అక్కడి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన తెలిపారు.


కార్యక్రమంలో పాల్గొన్న సిటీ ఇన్ఛార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. 'పతంగులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్. మూడు రోజుల పాటు వేడుక నిర్వహించడం ఆనందించదగ్గ విషయం. 19 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ ఇక్కడకు వచ్చారు. 1200 రకాల స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగరం.. గంగా జమున తహజీబ్‌కు ప్రతీక. ప్రజాపాలనలో ప్రతీ వేడుకను వైభవంగా నిర్వహిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం' అని పేర్కొన్నారు మంత్రి ప్రభాకర్.


ఇవీ చదవండి:

దారుణం.. రైలు పట్టాలపై గర్భిణీ ప్రసవం

బెట్టింగ్ యాప్‌ బారిన పడి యువకుడి బలి

Updated Date - Jan 13 , 2026 | 09:22 PM