Woman Delivers On Railway Track: రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:22 PM
ఒడిశాలోని బరంపురంకు చెందిన ప్రియా నిండు నెలల గర్భిణీ. ఎక్స్‌ప్రెస్ రైలులో కుటుంబ సభ్యులతో కలిసి సూరత్‌కు బయలుదేరింది. ఆ కొద్ది సేపటికే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి.
పార్వతీపురం, జనవరి 13: రైలు పట్టాలపై ఓ నిండు గర్భిణి ప్రసవించిన సంఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని బరంపూర్‌కు చెందిన ప్రియ పాత్ర.. నిండు గర్భిణీ. కొద్ది రోజుల్లో ఆమెకు నెలలు నిండనున్నాయి. మంగళవారం ఉదయం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సూరత్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో రైలులో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో సహచర ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని టీసీ ద్వారా గార్డుకు తెలియజేశారు.
పార్వతీపురం సమీపంలోకి రైలు వచ్చే సరికి.. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో సమీపంలోని బెలగాం స్టేషన్ వద్ద రైలును అత్యవసరంగా నిలిపివేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, మహిళా ప్రయాణికుల సహాయంతో రైలు నుంచి ప్రియా పాత్రను కిందకు దింపారు.
ఆ తర్వాత.. రైలు పట్టాల పైనుంచి ఆమెను దాటిస్తుండగా.. ఆమెకు నొప్పులు అధికమయ్యాయి. ఇంతలో పట్టాలపైనే ఆమె ప్రసవమయింది. అనంతరం.. తల్లీబిడ్డను ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో ప్రియ పాత్ర కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం
బెట్టింగ్ యాప్ బారిన పడి యువకుడి బలి
Read Latest AP News And Telugu News