Share News

Betting App: బెట్టింగ్ యాప్‌ బారిన పడి యువకుడి బలి

ABN , Publish Date - Jan 13 , 2026 | 02:48 PM

బెట్టింగ్ యాప్‌ల బారిన పడి.. తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది యువకులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో పలువురు టాలీవుడ్ నటులను ఇప్పటికే సీఐడీ, సిట్ అధికారులు విచారించారు.

Betting App: బెట్టింగ్ యాప్‌ బారిన పడి యువకుడి బలి
Young man died

నిజామాబాద్, జనవరి 13: బెట్టింగ్ యాప్‌లను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరహా యాప్‌ల బారినపడవద్దంటూ యువతను గట్టిగా హెచ్చరిస్తోంది. అయినప్పటికీ కొందరు యువత వాటి కారణంగా బలవంతంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఈ తరహా ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనెపల్లిలో చోటు చేసుకుంది. 22 ఏళ్ల సంజయ్.. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడడం కోసం భారీగా అప్పు చేశాడు. ఆ అప్పులు తీర్చాలంటూ అతడిపై ఒత్తిడి అధికమైంది.


తాను బెట్టింగ్ కోసం భారీగా అప్పులు చేసిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబితే.. తిడతారని సంజయ్ భయపడ్డాడు. దాంతో తీవ్ర ఆందోళన చెందిన అతడు గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంజయ్ బలవన్మరణంపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఈ బెట్టింగ్ యాప్‌ల బారినపడి.. తెలుగు రాష్ట్రాల్లో వందల మంది యువకులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మరోవైపు బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో పలువురు టాలీవుడ్ నటులను ఇప్పటికే సీఐడీ, సిట్ అధికారులు విచారించారు.. మరికొందరిపై ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రకాశ్ రాజ్, రాణా, మంచు లక్ష్మీ తదితరులను సీఐడీ అధికారులు పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లవద్దంటూ యువతకు టాలీవుడ్ నటులు స్పష్టమైన సూచనలు చేసిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు.. ప్రజలతో మమేకమై..

రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సమగ్ర సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

Read Latest TG News And Telugu News

Updated Date - Jan 13 , 2026 | 03:15 PM