Blinkit: ఇకపై 10 నిమిషాల్లో డెలివరీ బంద్.. కేంద్రం సంచలన నిర్ణయం..
ABN , Publish Date - Jan 13 , 2026 | 03:59 PM
ఇటీవల చాలా మంది ప్రతి చిన్న అవసరాలకు బ్లింకిట్,జెప్టో,స్విగ్గీ వంటి క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీపై ఆధారపడుతున్నారు. దానికి తగ్గట్టు ఈ సంస్థలు 10 నిమిషాల్లో డెలివరీ సదుపాయాన్ని అందిస్తున్నాయి. తాజాగా కేంద్రం ఆదేశాల మేరకు గిగ్ వర్కర్స్ కోసం బ్లింకిట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల బ్లింకిట్, జెప్టో ఇతర క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ(Food delivery) సంస్థలు కేవలం పది నిమిషాల్లో(Ten minutes) డెలివరీ సదుపాయాన్ని అందిస్తున్నామని ప్రకటనలు(Advertisements) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై గిగ్ వర్కర్స్(డెలివరీ ఏజెంట్స్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రిపేర్, ట్రాఫిక్ వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోతున్నారు. ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. క్విక్ కామర్స్(Quick Commerce) ఫ్లాట్ ఫామ్‌లైన బ్లింకిట్(Blinkit), జెప్టో(Zepto), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్(Swiggy Instamart) సంస్థలకు ‘10 నిమిషాల డెలివరీ’ విధానం తొలగించాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ.. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ సహా ఇతర క్విక్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమై డెలివరీ భాగస్వాముల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చర్చించారు. కేంద్రం ఆదేశాల మేరకు బ్లింకిట్ వంటి ఈ-కామర్స్ ఫాట్ ఫామ్‌లు 10 నిమిషాల డెలవిరీ క్లెయిమ్‌లను తొలగించినట్లు సమాచారం. ఇతర కంపెనీలు తమ బ్రాండ్ ప్రకటనలు, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ల నుంచి ఈ డెలివరీ ప్రకటన తొలగిస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. డెలివరీ ఏజెంట్లు ఇటీవల చేస్తున్న ఆందోళన దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం గిగ్ వర్కర్లకు ఊరట కలుగినట్టు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..
మధుమేహంతో భారత్‌పై ఆర్థిక భారం
Read Latest National News